News October 30, 2024

రేవంత్ కామెంట్స్‌పై స్పందించిన హరీశ్‌రావు

image

TG: తనను ఎలా డీల్ చేయాలో తెలుసని CM రేవంత్ చేసిన కామెంట్స్‌పై హరీశ్‌రావు స్పందించారు. తనను డీల్ చేయడానికంటే ముందు సీఎం కుర్చీ చేజారిపోకుండా కాపాడుకోవాలని హరీశ్‌రావు హితవు పలికారు. తాను ఫుట్‌బాల్ ఆటగాడినని చెప్పుకుంటున్న రేవంత్ వచ్చే ఎన్నికల్లో సెల్ఫ్‌గోల్ కొట్టుకోవడం తప్పదని ఎద్దేవా చేశారు. రేవంత్ ఫుట్‌బాలర్ అయితే తాను క్రికెట్ ఆడుతానని, వచ్చే ఎన్నికల్లో వికెట్ తీసేది తామేనని జోస్యం చెప్పారు.

Similar News

News February 11, 2026

అసెంబ్లీలో ఆవు కథలు చెప్పొద్దు.. మంత్రులకు CBN హెచ్చరిక

image

AP: క్యాబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో బాధ్యతగా మాట్లాడాలని సూచించారు. ఆవు కథలు చెప్పొద్దని, సమాధానాలు క్లుప్తంగా, అర్థమయ్యేలా ఉండాలని హితబోధ చేశారు. ఉ.9 గంటల నుంచి మ.2 గంటల వరకు అసెంబ్లీలోనే ఉండాలని, ఎమ్మెల్యేలు ప్రస్తావించే సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అటు శ్రీశైలంలో శివస్వాములపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని CM ఆగ్రహం వ్యక్తం చేశారు.

News February 11, 2026

కొత్త కార్పొరేషన్లతో కొత్త సమీకరణాలు

image

GHMCని 3 కార్పొరేషన్లుగా విభజించడంతో కొత్త రాజకీయ సమీకరణాలు కన్పించబోతున్నాయి. కొత్త GHMCలో చాలా జోన్లలో AIMIM ఆధిపత్యం, సైబరాబాద్‌లో ఆంధ్రా వ్యాపారులు ప్రభావం చూపుతారని విశ్లేషకుల అంచనా. ఇక మల్కాజిగిరి కార్పొరేషన్‌లో WGL, కరీంనగర్, NLG, MDK సహా తెలంగాణ జిల్లాల ప్రజల ప్రాబల్యం కన్పిస్తుంది. దీంతో ఆయా కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందుకు తగ్గట్లు పార్టీల, ప్రాంతాల కొత్త రాజకీయ శక్తులు, అవకాశాలు వస్తాయి.

News February 11, 2026

బ్లాక్ బీన్స్‌తో కలిగే హెల్త్ బెనిఫిట్స్ తెలుసా?

image

✦ ఫైబర్, పొటాషియం, ప్రొటెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్లు గుండె హెల్త్‌ను కాపాడుతాయని నిపుణులు చెబుతున్నారు.
✦ రిచ్ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం తగ్గుతాయి.
✦ అధిక ఫైబర్, ప్రొటీన్లు ఆకలిని కంట్రోల్ చేస్తాయి. దీంతో హెల్తీగా బరువు తగ్గుతారు.
✦ యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గిస్తాయి.
✦ ప్రొటీన్లు బాడీలోని టిష్యూస్‌ను రిపేర్ చేస్తాయి.
✦ ఐరన్, మెగ్నీషియం, ఫోలేట్ ఆరోగ్యంగా ఉంచుతాయి.