News October 30, 2024

వరంగల్ మార్కెట్లో తగ్గిన చిరుధాన్యాల ధరలు

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారంతో పోలిస్తే ఈరోజు సూక పల్లికాయ ధర స్వల్పంగా పెరిగింది. నిన్న రూ.4,600 పలికిన సూక పల్లికాయ నేడు రూ.4,610 ధర పలికింది. అలాగే 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.13వేలు ధర వచ్చింది. అలాగే మక్కలు బిల్టీ క్వింటాకి మంగళవారం రూ.2,550 ధర రాగా నేడు రూ.2,530కి పడిపోయిందని అధికారులు తెలిపారు.

Similar News

News October 30, 2024

WGL: నర్సంపేట మార్కెట్‌కు 4రోజులు సెలవులు

image

నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డుకు వరసగా 4 రోజులు సెలవులు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 31(గురువారం) దీపావళి, 1(శుక్రవారం) అమావాస్య, 2(శనివారం), 3(ఆదివారం) తేదీల్లో వ్యాపారుల విజ్ఞప్తి మేరకు సెలవులు ప్రకటించారు. తిరిగి 4న మార్కెట్ యథావిధిగా కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు.

News October 30, 2024

నర్సంపేట: సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన నాయకులు

image

నర్సంపేట మండలంలోని ఆకుల తండాలో నర్సంపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో నేడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు నానబోయిన చరణ్ రూ.60,000, బానోత్ మాన్సింగ్ రూ, 25,000లకు చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బానోతు రాము, కూకట్ల  శ్రీనివాస్, శ్రీశైలం, సంపత్ తదితరులు ఉన్నారు.

News October 30, 2024

WGL: డా.గుండాల మదన్‌కు అబ్దుల్ కలాం ఎక్సెలెన్సీ అవార్డు

image

వరంగల్ జిల్లాకు చెందిన డా.గుండాల మదన్ కుమార్ భారతరత్న Dr.APJ అబ్దుల్ కలాం ఎక్సెలెన్సీ అవార్డు అందుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మెగాసిటీ నవకళావేదిక, మదర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. గత 30 ఏళ్లుగా పేదవారికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న కృషికి ప్రతిఫలంగా ఈ అవార్డు ఇచ్చినట్లు వారు తెలిపారు.