News October 30, 2024
యశ్ మూవీ షూటింగ్ కోసం 599 ఎకరాల్లో చెట్లు నరికారు: మంత్రి
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ మూవీ చిత్రీకరణ కోసం భారీగా చెట్లను నరికివేశారని కర్ణాటక పర్యావరణ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆరోపణలు చేశారు. పీణ్య-జాలహళ్లి ప్రాంతంలోని 599 ఎకరాల అటవీ భూమిలో ఉన్న వేలాది చెట్లను నరికివేశారని ఆయన పేర్కొన్నారు. అక్కడ ఒక చిన్న గ్రామాన్ని తలపించే సెట్‌ను నిర్మించినట్లు వెల్లడించారు. చిత్ర యూనిట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.
Similar News
News November 18, 2024
నేటి నుంచి కొత్త ఈవీ పాలసీ
TG: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి కొత్త ఈవీ పాలసీ అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం రోడ్డు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100% మినహాయింపు ఇవ్వనుంది. బైక్స్, ఆటోలు, ఫోర్ వీలర్స్, కమర్షియల్ వెహికల్స్, ట్రాక్టర్లు ఈవీలు అయితే వాటికీ ఇది వర్తిస్తుంది. ఈ పాలసీ 2026, DEC 31 వరకు అమలులో ఉంటుంది. RTC ఈవీ బస్సులు కొంటే వాటికి కూడా ట్యాక్స్ ఫ్రీ అమలవుతుందని మంత్రి పొన్నం తెలిపారు.
News November 18, 2024
రైళ్లన్నీ ఫుల్.. సంక్రాంతికి ఊరెళ్లేదెలా?
సికింద్రాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నీ ఫుల్ అయ్యాయి. దీంతో సంక్రాంతి పండక్కి సొంతూర్లకు ఎలా వెళ్లాలని ప్రయాణికులంతా ఆందోళన చెందుతున్నారు. ఏటా పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచకపోవడంతో ప్రస్తుతం ఉన్న రైళ్లపైనే తీవ్రంగా ఒత్తిడి ఉంటోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ వరకూ ఫలక్‌నుమా, విశాఖ, గోదావరి, గరీభ్‌రథ్, ఈస్ట్‌కోస్ట్ సహా ఇతర రైళ్లల్లో బెర్తులే లేవు
News November 18, 2024
గ్రీవెన్స్ డేలో ఆధార్ తప్పనిసరి
AP: ప్రతి సోమవారం ఎస్పీ ఆఫీసుల్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(గ్రీవెన్స్ డే)లో ఫిర్యాదు చేసేవారికి అధికారులు కీలక సూచన చేశారు. తమ వెంట తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకురావాలని తెలిపారు. ఫిర్యాదు పత్రానికి ఆధార్ ప్రతిని జత చేయాలని, ఇది ఈరోజు నుంచే అమల్లోకి రానున్నట్లు చెప్పారు. అయితే ఈ నిబంధన కలెక్టర్ కార్యాలయాల్లో వర్తిస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత లేదు.