News October 30, 2024

SPFకు సచివాలయ భద్రత

image

TG: రాష్ట్ర సచివాలయ భద్రత బాధ్యతను ప్రభుత్వం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF)కు అప్పగించింది. ఇప్పటివరకు తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) విధులు నిర్వహించింది. పాత సచివాలయంలో 25 ఏళ్లుగా SPF సిబ్బందే భద్రతను పర్యవేక్షించారు. కొత్త సెక్రటేరియట్ నిర్మాణం తర్వాత అప్పటి BRS సర్కార్ TGSPని నియమించింది. అయితే ఇటీవల బెటాలియన్ పోలీసుల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా వారిని తొలగించినట్లు తెలుస్తోంది.

Similar News

News October 31, 2024

కరెన్సీ: ఏ నోటు తయారీకి ఎంత ఖర్చు?

image

మ‌నం నిత్యం ఉప‌యోగించే ₹10, ₹20, ₹50, ₹100 నోట్ల త‌యారీకి ఎంత ఖ‌ర్చ‌వుతుంద‌ని ఎప్పుడైనా ఆలోచించారా?. ఇటీవ‌ల ఆర్బీఐ విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం ₹10 నోటు త‌యారీకి ₹0.96 ఖ‌ర్చ‌వుతుంది. అదే ₹20 నోటుకి ₹0.95 *₹50 నోటుకి ₹1.13 *₹100 నోటుకి ₹1.77 *₹200 నోటుకి ₹2.37 *అలాగే ₹500 నోటుకి ₹2.29 ఖ‌ర్చ‌వుతుంది. ₹200 నోటు త‌యారీకి ₹500 నోటు త‌యారీ కంటే ఖ‌ర్చు ఎక్కువ‌ కావడం గ‌మ‌నార్హం.

News October 31, 2024

RCB రిటెన్షన్ ఫైనల్ లిస్ట్ ఇదే?

image

తమ రిటెన్షన్ లిస్ట్‌పై RCB ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఓ పజిల్‌ను పోస్ట్ చేసింది. ‘పజిల్‌లో తమ ఆటగాళ్ల రిటెన్షన్లు దాగి ఉన్నాయి, కనుక్కోండి’ అంటూ హింట్ ఇచ్చింది. కాగా ఈ పజిల్‌లో మ్యాక్స్‌వెల్, కోహ్లీ, గ్రీన్, పటీదార్, డుప్లెసిస్, విల్ జాక్స్, సిరాజ్, యశ్ దయాల్, అనూజ్ రావత్ పేర్లు దాగి ఉన్నాయి. వీరిలో కొందరిని కచ్చితంగా రిటైన్ చేసుకుంటుందని సమాచారం.

News October 31, 2024

గుడ్.. బాగా చేశారు: సీఎం చంద్రబాబు

image

AP: విజయవాడలో ఇటీవల నిర్వహించిన అమరావతి డ్రోన్ సమ్మిట్‌ను విజయవంతం చేశారంటూ పలువురు అధికారులను సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారు. ఈ నెల 22న విజయవాడ పున్నమి ఘాట్ వద్ద కృష్ణా తీరాన 5,500లకు పైగా డ్రోన్లతో నిర్వహించిన షో అద్భుతంగా ఉందని కొనియాడారు. ఎక్కడా ఎలాంటి అంతరాయాలు లేకుండా సమన్వయంతో అధికారులు వ్యవహరించారని, ఇదే స్ఫూర్తితో మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సీఎం సూచించారు.