News October 30, 2024
రిపబ్లికన్లను కలవరపెడుతున్న ప్యూర్టో రికో
అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడేకొద్దీ అమెరికా అధీనంలోని ప్యూర్టో రికో రిపబ్లికన్లను టెన్షన్ పెడుతోంది. ట్రంప్ మాడిసన్ స్క్వేర్ సభలో స్టాండప్ కమెడియన్ టోనీ హించ్‌క్లిఫ్ ప్యూర్టో రికోను ఓ చెత్తకుప్పతో పోల్చడం వివాదం రేపింది. ఈ ద్వీపంలోని ప్రజలు ఎన్నికల్లో ఓటు వేయకపోయినా ఇక్కడి మూలాలున్న 60 లక్షల మంది ఓటర్లు అమెరికాలో నివసిస్తున్నారు. ఇప్పుడు వీరంతా రిపబ్లికన్లపై గుర్రుగా ఉన్నారు.
Similar News
News January 3, 2025
నేటి నుంచి ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు
ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక మహాసభలు నేటి నుంచి మూడు రోజుల పాటు HYDలోని హైటెక్స్‌లో జరగనున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు ఈ సభలను ప్రారంభించనున్నారు. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క హాజరుకానున్నారు. ఎల్లుండి ముగింపు వేడుకల్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.
News January 3, 2025
నేడు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు
TG: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించనుంది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. ఘటనకు, అల్లు అర్జున్‌కు సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మరోవైపు అల్లు అర్జున్‌కు బెయిల్ ఇస్తే విచారణకు సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. కోర్టు తీర్పుపై ఉత్కంఠ నెలకొంది.
News January 3, 2025
రైలు పట్టాలపై పబ్‌జీ.. ముగ్గురు యువకుల మృతి
పబ్‌జీ ఆట పిచ్చి బిహార్‌లో ముగ్గురు టీనేజీ యువకుల ప్రాణాలు తీసింది. పశ్చిమ చంపారన్ జిల్లాకు చెందిన ముగ్గురు కుర్రాళ్లు మాన్సా తోలా ప్రాంతంలో రైలుపట్టాలపై పబ్‌జీ ఆడుతున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉండటంతో రైలు వస్తున్న సంగతి వారు గుర్తించలేదు. వారిపైనుంచి రైలు వెళ్లిపోయింది. దీంతో అందరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.