News October 30, 2024

శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాలు పకడ్బందీగా జరగాలి: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జయంతి ఉత్సవాలు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరతో కలిసి సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నవంబర్ 15వ తేదీలోగా జయంతి వేడుకలకు సంబంధించి అన్ని పనులు పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికతో పనులు చేపట్టాలన్నారు.

Similar News

News October 31, 2024

ఎంఎస్‌ రాజును మరోసారి వరించిన అదృష్టం

image

మడకశిర MLA ఎంఎస్‌ రాజుకు టీటీడీ బోర్డ్ సభ్యుడిగా అవకాశం దక్కడంతో ఆ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి చేసిన సేవలకు గానూ మరో గుర్తింపు దక్కిందని కొనియాడుతున్నారు. గత ప్రభుత్వంలో ఆయనపై 60 కేసులు నమోదయ్యాయి. ఎన్నికల్లో చివరి నిమిషంలో టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. లోకేశ్ పాదయాత్రలో ఆయన వెంటే ఉన్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో అనంతపురం నుంచి అమరావతి వరకు సైకిల్‌ యాత్ర చేశారు.

News October 31, 2024

ప్రమాదం సంభవిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి: అనంతపురం SP

image

టపాకాయలు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఆయన పరిశీలించారు. అక్కడ నిర్వాహకులు తీసుకున్న జాగ్రతలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్ 100, 101, 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వెంటనే సిబ్బంది అందుబాటులోకి వచ్చి ప్రమాదాన్ని నివారిస్తారని స్పష్టం చేశారు.

News October 31, 2024

గుంతకల్లు: దీపావళి పండుగకు ప్రత్యేక రైళ్లు

image

గుంతకల్లు రైల్వే డివిజన్‌లో దీపావళి పండుగ సందర్భంగా అనంతపురం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. బెంగళూరు నుంచి రైలు (06237) నవంబరు 4న రాత్రి 9.00 గంటలకు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, కర్నూలు మీదుగా ప్రయాణించి నవంబరు 6వ తేదీ రాత్రి 8 గంటలకు బరౌనీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు బరౌనీలో నవంబరు 9న ఉ.10 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.