News October 30, 2024
కోడింగ్‌పై సుందర్ పిచ్చాయ్ కీలక వ్యాఖ్యలు
గూగుల్‌లో 25% కోడ్‌లను AI ద్వారా జనరేట్ చేస్తున్నట్టు CEO సుందర్ పిచ్చాయ్ తెలిపారు. బేసిక్ అవసరాలును AIతో తీర్చుకోగలిగినా వాటిని హ్యుమన్ ఇంజినీర్లు చెక్ చేస్తున్నట్టు తెలిపారు. తద్వారా ఆయన ఎంట్రీలెవల్, కోడింగ్ జాబ్‌లపై అనేక ప్రశ్నలు లేవనెత్తారనే టాక్ నడుస్తోంది. దీని వల్ల ఉద్యోగాలు పోతాయని కాకుండా ఉద్యోగులు ఇన్నోవేషన్‌పై దృష్టిసారించే ఆస్కారం ఏర్పడుతుందని చెబుతున్నారు.
Similar News
News November 14, 2024
కొత్త పెన్షన్లపై ప్రభుత్వం GOOD NEWS
AP: అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్‌దారులు గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని ఆదేశించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
News November 14, 2024
చంద్రబాబూ.. నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?: రజిని
AP: సూపర్ సిక్స్ హామీలిచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని మాజీ మంత్రి రజిని ప్రశ్నించారు. ‘ఆడబిడ్డ నిధి, దీపం, తల్లికి వందనం, అన్నదాత పథకాలకు ఎన్ని కోట్లు కేటాయించావ్? ఉచిత బస్సుకు అతీగతీలేదు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావ్? రూ.4వేల పింఛన్ ఎంత మందికిచ్చావ్? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తానంటున్నావ్? నాతో సహా మా పార్టీ కార్యకర్తలు నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు’ అని తెలిపారు.
News November 14, 2024
ఎట్టకేలకు రిలయన్స్-డిస్నీ విలీనం పూర్తి
రిలయన్స్, డిస్నీ+హాట్‌స్టార్ విలీన ప్రక్రియ పూర్తైంది. ఈ సంస్థను జియో స్టార్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా నీతా అంబానీ, వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ వ్యవహరిస్తారు. రూ.70,353 కోట్లతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యంగా నిలిచింది. ఈ కంపెనీలో రిలయన్స్ వాటా 63.16%, వాల్ట్ డిస్నీకి 36.84 % వాటా ఉంటుంది. ఈ రెండింటిలోని 100కు పైగా ఛానళ్లు ఒకే చోటకు రానున్నాయి.