News October 30, 2024
టీటీడీ నూతన ఛైర్మన్‌ది చిత్తూరు జిల్లానే..
TTD నూతన ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడిది చిత్తూరు జిల్లానే. పెనుమూరు మం. దిగువ పూనేపల్లిలో మునిస్వామి నాయుడు-లక్ష్మి దంపతులకు 1952 సెప్టెంబరు 15న జన్నించారు. రైతు కుటుంబంలో జన్నించిన ఆయన ఉన్నత చదువులు చదివారు. తొలి రోజుల్లో బీహెచ్ఈఎల్లో ఉద్యోగం చేశారు. బిజినెస్‌పై ఆసక్తితో ట్రావెల్ క్లబ్ పేరుతో ఎయిర్ టికెట్ వ్యాపారంలోకి ప్రవేశించారు. తర్వాత టీవీ5 సంస్థను స్థాపించి వ్యాపారాన్ని విస్తరించారు.
Similar News
News October 31, 2024
తిరుపతి: నేడు విద్యుత్ బిల్లుల వసూలు
వినియోగదారుల కోసం గురువారం విద్యుత్తుశాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని తిరుపతి జిల్లా SE సురేంద్రనాయుడు తెలిపారు. బిల్లులు సకాలంలో చెల్లించి అపరాధ రుసుము పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News October 31, 2024
చిత్తూరు: మోసగించి మైనర్‌ను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై పోక్సో కేసు
మోసగించి బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పెద్దమడ్యం ఎస్ఐ పివి రమణ తెలిపారు. మండలంలోని దామ్లానాయక్ తండాకు చెందిన నాన్ కే నాయక్(24) అదే పంచాయతికి చెందిన 16ఏళ్ల మైనర్‌ను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నట్లు తెలిపారు. తంబళ్లపల్లె మల్లయ్య కొండకు తీసుకెళ్లి ఈనెల 21న మైనర్‌ను మోసగించి పెళ్లి చేసుకోవడంతో కుటుంబీకులు తెలుసుకుని ఫిర్యాదుచేయగా పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
News October 31, 2024
తిరుపతి: నవంబర్ 1 నుంచి స్కిల్ సెన్సస్
నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే స్కిల్ సెన్సస్ సర్వేకు ప్రజలు పూర్తి సమాచారం అందించి అధికారులకు సహకరించాలని జేసీ శుభం బన్సల్ తెలిపారు. బుధవారం స్కిల్ సెన్సస్ సర్వే గురించి జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలిసి జాగ్రత్తగా సర్వే చేయాలన్నారు. ఏ చిన్న తప్పిదం జరగకుండా బెస్ట్ క్వాలిటీ సర్వే జరగాలని ఆదేశించారు.