News October 30, 2024

వాళ్లిద్దరూ వ్యతిరేకించినా గెలుపు నాదే: నవాబ్

image

BJP, శివసేన వ్యతిరేకించినా మ‌న్‌ఖుర్ద్ శివాజీన‌గ‌ర్ స్థానంలో గెలుపు తనదే అని NCP అభ్యర్థి నవాబ్ మాలిక్ అన్నారు. ఈ స్థానం నుంచి సురేశ్ పాటిల్‌ను శివసేన బరిలో దింపడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘BJP కూడా పాటిల్‌కు మద్దతు తెలుపుతోంది. నా కుమార్తె బరిలో దిగుతున్న అనుశక్తి నగర్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. అయినా మాకు నష్టం లేదు. నేను, నా కుమార్తె సనా భారీ మెజారీటీతో గెలుస్తాం’ అన్నారు.

Similar News

News November 14, 2024

కొత్త పెన్షన్లపై ప్రభుత్వం GOOD NEWS

image

AP: అర్హులైన పెన్షన్‌దారులు డిసెంబర్ మొదటి వారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పెన్షన్‌దారులు గ్రామంలో ఒకటి, రెండు నెలలు లేకపోయినా తదుపరి నెలలో పెన్షన్ మొత్తాన్ని కలిపి ఇవ్వాలని ఆదేశించారు. అనర్హులు పెన్షన్ తీసుకుంటున్నట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

News November 14, 2024

చంద్రబాబూ.. నీపై 420 కేసు ఎందుకు పెట్టకూడదు?: రజిని

image

AP: సూపర్ సిక్స్ హామీలిచ్చి ఎగ్గొట్టిన చంద్రబాబుపై 420 కేసు ఎందుకు పెట్టకూడదని మాజీ మంత్రి రజిని ప్రశ్నించారు. ‘ఆడబిడ్డ నిధి, దీపం, తల్లికి వందనం, అన్నదాత పథకాలకు ఎన్ని కోట్లు కేటాయించావ్? ఉచిత బస్సుకు అతీగతీలేదు. ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావ్? రూ.4వేల పింఛన్ ఎంత మందికిచ్చావ్? ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తానంటున్నావ్? నాతో సహా మా పార్టీ కార్యకర్తలు నిలదీస్తూ కచ్చితంగా పోస్టులు పెడతారు’ అని తెలిపారు.

News November 14, 2024

ఎట్టకేలకు రిలయన్స్-డిస్నీ విలీనం పూర్తి

image

రిలయన్స్, డిస్నీ+హాట్‌స్టార్ విలీన ప్రక్రియ పూర్తైంది. ఈ సంస్థను జియో స్టార్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా నీతా అంబానీ, వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ వ్యవహరిస్తారు. రూ.70,353 కోట్లతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యంగా నిలిచింది. ఈ కంపెనీలో రిలయన్స్ వాటా 63.16%, వాల్ట్ డిస్నీకి 36.84 % వాటా ఉంటుంది. ఈ రెండింటిలోని 100కు పైగా ఛానళ్లు ఒకే చోటకు రానున్నాయి.