News October 30, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,25,713 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.67,791, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.40,700, అన్నదానం రూ.17,222 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రజలకు తెలియజేశారు.

Similar News

News November 24, 2024

మంథని: కోటి దీపోత్సవంలో శ్రీధర్ బాబు

image

హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం దివ్యానుభూతి ఇచ్చిందన్నారు. కార్తీకమాస పూజల్లో భాగంగా సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అపూర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ నిర్వాహకులను అభినందించారు.

News November 24, 2024

జగిత్యాల: మత్స్యకారుడి వలకు చిక్కిన అరుదైన చేప

image

జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో చేపల వేటకు వెళ్లిన గంగ పుత్రులకు ఓ అరుదైన చేప చిక్కింది. సక్కరమౌత్ క్యాట్ ఫిష్ అనే అరుదైన చేప తులసినగర్‌కి చెందిన గంగపుత్రుడు నవీన్ వలకు చిక్కింది. ఈ చేపను మార్కెట్లోకి అమ్మకానికి తీసుకు రావడంతో అంతా ఆసక్తిగా తిలకించారు. ఇవి ఎక్కువగా ఉష్ణ మండలంలోని మంచినీటిలో ఉంటాయని నవీన్ తెలిపారు.

News November 24, 2024

KNR: తెలంగాణ దర్శిని కార్యక్రమ సమావేశం

image

కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో శనివారం తెలంగాణ దర్శిని కార్యక్రమంపై పర్యాటక శాఖ కమిటీ సమావేశం కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన నిర్వహించారు. పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు వెళ్లడం ద్వారా మన సంస్కృతి సంప్రదాయాలు,చారిత్రక ప్రదేశాలపై విద్యార్థులకు అవగాహన కలుగుతుందని కలెక్టర్ చెప్పారు. అనంతరం విద్యార్థులను తీసుకెళ్లే పర్యాటక ప్రాంతాల గురించి అధికారులతో చర్చించారు.