News October 30, 2024
YCP MP విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం

AP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి అరుదైన గౌరవం లభించింది. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ (UNGA) 29వ సెషన్‌కు వెళ్లే బృందంలో ఆయనకు స్థానం దక్కింది. ఈ విషయాన్ని ఆయన ‘ఎక్స్’ ద్వారా తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. వచ్చే నెల 18 నుంచి 23 వరకు జరిగే ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు
Similar News
News November 10, 2025
సెకండరీ ఆస్పత్రులకు వైద్యుల కేటాయింపు

AP: సెకండరీ ఆస్పత్రులకు వైద్యులను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 243 సెకండరీ ఆసుపత్రులుండగా 142 చోట్ల నియామకాలు జరిగాయి. 7 CHCలు, 6 ఏరియా ఆసుపత్రుల్లో ముగ్గురు చొప్పున, 31 CHCలకు ఇద్దరు చొప్పున, మరో 13 ఏరియా ఆసుపత్రులకు ఇద్దరేసి, 3 జిల్లా ఆసుపత్రులకు ఇద్దరు చొప్పున స్పెషలిస్టులను నియమించారు. మరో 97 ఆసుపత్రులకు ఒక్కరు చొప్పున నియామకాలు జరిగాయి.
News November 10, 2025
అవి శశిథరూర్ వ్యక్తిగత అభిప్రాయాలు: కాంగ్రెస్

బీజేపీ అగ్రనేత అద్వానీపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ <<18243287>>ప్రశంసలు<<>> కురిపించడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలు అని వెల్లడించింది. ఆ మాటలకు పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఇవి ప్రతిబింబిస్తాయని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తికి ఈ మాటలు నిదర్శనమని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా వెల్లడించారు.
News November 10, 2025
కూతురి విజయం.. తండ్రికి మళ్లీ పోలీస్ జాబ్!

ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ సభ్యురాలైన క్రాంతి గౌడ్‌కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. అంతేకాకుండా 2012లో ఎన్నికల విధుల్లో పొరపాటు వల్ల పోలీస్ ఉద్యోగం కోల్పోయిన ఆమె తండ్రి మున్నాసింగ్‌కు తిరిగి కానిస్టేబుల్ జాబ్ ఇస్తామని తెలిపింది. తన తండ్రిని మళ్లీ యూనిఫామ్‌లో చూడటం, ఆయన గౌరవంగా రిటైర్ అయ్యేలా చేయడమే తన కల అని క్రాంతి పేర్కొన్నారు. ఒకప్పుడు తమకు తిండికి కూడా ఉండేది కాదన్నారు.


