News October 30, 2024

దీపావళి: ప్రజలకు అలర్ట్ మెసేజ్‌లు

image

టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని APSDMA పేర్కొంది. ప్రజల మొబైల్స్‌కు అలర్ట్ మెసేజ్‌లు పంపుతోంది. ‘అగ్నిప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించండి. బాణసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి. ఇంటి కిటికీలు, తలుపులు మూసేయండి. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు టపాసులు కాల్చాలి. టపాసులు వెలిగించి విచక్షణా రహితంగా విసరకండి’ అని మెసేజ్ పంపుతోంది.

Similar News

News July 7, 2025

శ్రీశైలం ప్రాజెక్టుకు పెరిగిన వరద

image

AP: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. జూరాల, సుంకేశుల నుంచి 1.98 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తి కోసం 59వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు గానూ ప్రస్తుతం 880.40 అడుగులకు నీరు చేరింది. నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 190.33 TMCలుగా ఉంది. రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

News July 7, 2025

చేప పిల్లలు వద్దు.. నగదు ఇవ్వండి: మత్స్యకారులు

image

TG: ప్రభుత్వం ఏటా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. వాటిని కాంట్రాక్టర్ల ద్వారా పంపిణీ చేయడం వద్దని, నేరుగా సహకార సంఘాలకు నగదు బదిలీ చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. నగదు ఇస్తే తామే నాణ్యమైన చేప పిల్లలను కొనుగోలు చేసుకుంటామన్నారు. కాంట్రాక్టర్లు సైజ్, నాణ్యతలో నిబంధనలు పాటించట్లేదని ఆరోపిస్తున్నారు. INC నేత జీవన్ రెడ్డి సైతం నగదు అంశంపై మంత్రి శ్రీహరికి లేఖ రాశారు.

News July 7, 2025

సినీ హీరో మహేశ్‌బాబుకు నోటీసులు

image

TG: సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న హీరో మహేశ్‌బాబుకు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ నోటీసులిచ్చింది. తమ వెంచర్‌కు అన్ని అనుమతులున్నాయని మహేశ్ ఫొటోతో ఉన్న బ్రౌచర్ చూసి బాలాపూర్‌లో ₹34.80లక్షలు పెట్టి స్థలం కొన్నామని ఇద్దరు ఫిర్యాదు చేశారు. లేఔట్ లేకపోవడంతో డబ్బు ఇవ్వమంటే సంస్థ ₹15లక్షలే ఇచ్చిందన్నారు. దీంతో ఇవాళ విచారణకు హాజరుకావాలని మహేశ్‌తో పాటు సంస్థను కమిషన్ ఆదేశించింది.