News October 30, 2024

ఆఖరి టెస్టు కోసం టీమ్ ఇండియా కసరత్తు

image

న్యూజిలాండ్‌తో జరగబోయే చివరి టెస్టు కోసం టీమ్ ఇండియా తీవ్ర కసరత్తులు చేస్తోంది. భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. కెప్టెన్‌ రోహిత్‌తోపాటు కోహ్లీ, బుమ్రా, జడేజా, ఆకాశ్ దీప్ తదితర ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తూ కనిపించారు. కాగా ఎల్లుండి ముంబైలోని వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ప్రారంభం కానుంది. రెండో టెస్టులో ఆడిన జట్టుతోనే రోహిత్ సేన ఈ మ్యాచ్‌లోనూ బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News January 3, 2025

రోహిత్ నిర్ణయంపై రవిశాస్త్రి ప్రశంసలు

image

ఫామ్ లేమితో సతమతమవుతున్న భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఐదో టెస్టు నుంచి పక్కకు తప్పుకోవడంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గిల్ ఆడితే జట్టు బలంగా ఉంటుందని భావించి రోహిత్ బెంచ్‌కే పరిమితమయ్యారని అన్నారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ తీసుకున్నది గొప్ప నిర్ణయమని చెప్పారు. జట్టు కోసం రోహిత్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మెచ్చుకున్నారు.

News January 3, 2025

రైతులకు రూ.20,000.. ఎప్పుడంటే?

image

AP: అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రైతులకు ఏడాదికి రూ.20,000 చొప్పున సాయం చేసే ఈ పథకాన్ని PM కిసాన్ నిధులు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు అమలు చేయాలని నిర్ణయించింది. PM కిసాన్‌ను ₹6వేల నుంచి కేంద్రం ₹10వేలకు పెంచనుందని, దానికి రాష్ట్ర ప్రభుత్వం ₹10వేలు కలిపి మొత్తం ₹20వేలు ఇస్తామని CM CBN చెప్పారు. 3 విడతల్లో కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రమూ అంతే మొత్తంలో ఇవ్వనుంది.

News January 3, 2025

జియో రూ.40,000 కోట్ల IPO

image

రిలయన్స్ జియో IPOకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీని ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే జరిగితే స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద IPOగా రిలయన్స్ జియో పేరు నిలిచిపోతుంది. ఇందుకోసం సంస్థ విలువను రూ.10లక్షల కోట్లుగా చూపించనున్నట్లు తెలుస్తోంది. మే/జూన్ తర్వాత ఈ IPO మార్కెట్లోకి వచ్చే ఛాన్సుంది.