News October 30, 2024
RESULTS: ఫార్మా డీ ఫలితాలు విడుదల
అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డీ 2, 3, 4 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R14, R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్ను సందర్శించాలని సూచించారు.
Similar News
News October 31, 2024
ప్రమాదం సంభవిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి: అనంతపురం SP
టపాకాయలు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ ప్రజలకు సూచించారు. నగరంలో ఏర్పాటు చేసిన బాణసంచా దుకాణాలను ఆయన పరిశీలించారు. అక్కడ నిర్వాహకులు తీసుకున్న జాగ్రతలు పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రమాదం సంభవిస్తే వెంటనే డయల్ 100, 101, 112కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వెంటనే సిబ్బంది అందుబాటులోకి వచ్చి ప్రమాదాన్ని నివారిస్తారని స్పష్టం చేశారు.
News October 31, 2024
గుంతకల్లు: దీపావళి పండుగకు ప్రత్యేక రైళ్లు
గుంతకల్లు రైల్వే డివిజన్లో దీపావళి పండుగ సందర్భంగా అనంతపురం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు డివిజన్ అధికారులు తెలిపారు. బెంగళూరు నుంచి రైలు (06237) నవంబరు 4న రాత్రి 9.00 గంటలకు బయలుదేరి ధర్మవరం, అనంతపురం, కర్నూలు మీదుగా ప్రయాణించి నవంబరు 6వ తేదీ రాత్రి 8 గంటలకు బరౌనీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు బరౌనీలో నవంబరు 9న ఉ.10 గంటలకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.
News October 31, 2024
శ్రీ సత్యసాయి: ‘కేజీబీవీ టీచింగ్ పోస్టుల మెరిట్ లిస్ట్ వచ్చేసింది’
శ్రీ సత్యసాయి జిల్లాలో కేజీబీవీలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు మెరిట్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు బ్లాక్ స్పాట్లో ఉంచినట్లు డీఈవో కిష్టప్ప తెలిపారు. అభ్యంతరాలు ఉంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆధారాలతో అందజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలు పరిశీలిస్తామని పేర్కొన్నారు.