News October 31, 2024
గుంటూరులో ‘రన్ ఫర్ యూనిటీ’: ఎస్పీ
గుంటూరు జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం 6:45 గంటలకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ‘ఐక్యత పరుగు'(రన్ ఫర్ యూనిటీ) నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ ఐక్యత పరుగులో పాల్గొనవచ్చునని ఎస్పీ సూచించారు. ‘ప్రతి ఒక్కరూ సమానులే’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News November 25, 2024
గుంటూరు జిల్లాలో PPP విధానంలో నిర్వహణ ఈ రోడ్లే
జాతీయ రహదారులు మాదిరిగా APలో కూడా పీపీపీ విధానంతో పలురోడ్లు గుత్తేదారులకు నిర్వహణ బాధ్యత అప్పజెప్పేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కాగా గుంటూరు జిల్లాలో తొలి విడతకు గుంటూరు-పర్చూరు 41.44 కి.మీ, గుంటూరు-బాపట్ల 51 కి.మీ, మంగళగిరి-తెనాలి-నారాకోడూరు 40.25 కి.మీ, ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఏటా ఆయా రోడ్లపై గుంతలు పడితే వాటిని పూడ్చేందుకు PPP విధానంతో సదరు గుత్తేదారు సంస్థ చూసుకోనుంది.
News November 25, 2024
ఉపాధి కల్పనలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా 2వ స్థానం
ఎంఎస్ఎంఈ (మైక్రో,స్మాల్&మీడియం ఎంటర్ప్రైజెస్) ద్వారా గుంటూరు జిల్లాలో 16.085 యూనిట్లు రూ.477.56కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో 2వ స్థానం సాధించింది. ముందు వరుసలో విశాఖ, తర్వాత నెల్లూరు, కృష్ణా జిల్లాలు ఉన్నట్లు సామాజిక ఆర్థిక సర్వే-2024 వెల్లడించింది. ప్రభుత్వ పారిశ్రామిక పాలసీతో 2023-27ల్లో 19,86,658 మందికి ఉపాధి లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనిపై మీ కామెంట్..
News November 25, 2024
సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే.!
సీఎం చంద్రబాబు సోమవారం షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరి వెలగపూడి సచివాలయానికి వెళతారు. అక్కడ సీఆర్డీఏపై రివ్యూ చేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మున్సిపల్ శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్ల మరమ్మతులపై చంద్రబాబు రివ్యూ చేయనున్నట్లు తెలిపారు.