News October 31, 2024
హామీలెందుకు నెరవేర్చలేకపోతున్నారు: కూనంనేని

TG: ఎన్నికల హామీలను ఎందుకు నెరవేర్చలేకపోతున్నారో శ్వేతపత్రం విడుదల చేయాలని CPI రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వానికి సూచించారు. మూసీ పునరుద్ధరణపై విదేశాల్లో అధ్యయనానికి ముందు ఇక్కడి ప్రజల పరిస్థితిని తెలుసుకోవాలన్నారు. వారికి నిధుల చెల్లింపులో జాప్యానికి కారణాలేంటో చెప్పాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ BJP, BRS రహస్య అజెండాతో ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
Similar News
News July 5, 2025
రేపు తొలి ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు: పండితులు

హిందూ సంప్రదాయం ప్రకారం ఆషాఢమాసంలో వచ్చే మొదటి ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు. ఇక్కడి నుంచే పండుగలు మొదలవుతాయి. ఈసారి తొలి ఏకాదశి జులై 6న (ఆదివారం) వచ్చింది. రేపు తులసి దళాలను పూజలో ఉపయోగించరాదని పండితులు చెబుతున్నారు. ఇతరులతో గొడవ పడటం, వారిపై నిందలు వేయడం చేయొద్దని, పగటి పూట నిద్రపోవద్దని అంటున్నారు. ఉపవాసం ఉండాలని, మద్యపానం, మాంసాహారానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.
News July 5, 2025
మెగా PTM 2.0పై అపోహలు వద్దు: పాఠశాల విద్యాశాఖ

AP: ఈనెల 10న మెగా PTM 2.0లో (పేరెంట్స్, టీచర్స్ మీటింగ్) 2.28cr+ మంది పాల్గొని గిన్నిస్ రికార్డు సృష్టించాలని సమగ్ర శిక్షా పథక రాష్ట్ర సంచాలకుడు B.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రికార్డు కోసం మాత్రమే విట్నెస్ నమోదు అని, దీని వెనుక వేరే ఏ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. HMలు, టీచర్లు అపోహలు వీడాలని సూచించారు. ప్రభుత్వోద్యోగులు, పేరెంట్స్ కాకుండా ఎవరితోనైనా సంతకం చేయించొచ్చని పేర్కొన్నారు.
News July 5, 2025
గిల్ సరికొత్త చరిత్ర

భారత టెస్టు జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. అరంగేట్రం చేసిన సిరీస్‌లోనే అత్యధిక పరుగులు(450+) చేసిన భారత కెప్టెన్‌గా నిలిచారు. దీంతో పాటు ఇంగ్లండ్‌లో ఒక టెస్టులో 300+ పరుగులు చేసిన తొలి ఆసియా కెప్టెన్, బ్యాటర్‌గానూ నిలిచారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి ఇన్నింగ్సులో 269 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్సులో 52* రన్స్‌తో ఆడుతున్నారు.