News October 31, 2024
విక్రయాల్లో ‘వివో’.. విలువలో ‘శాంసంగ్’ టాప్

భారత్‌లో స్మార్ట్ ఫోన్ విక్రయాల పరంగా 19.4% వాటాతో వివో అగ్రస్థానంలో నిలిచినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్ మూడో క్వార్టర్ గణాంకాలను అది వెలువరించింది. ఆ తర్వాత షావోమి(16.7%), శాంసంగ్(15.8%), ఒప్పో(13.4%), రియల్‌మీ(11.3%) ఉన్నాయంది. ఇక విక్రయాల్లో విలువపరంగా 22.8% వాటాతో శాంసంగ్ టాప్‌లో ఉన్నట్లు తెలిపింది. రెండో స్థానంలో యాపిల్(21.8%) ఉన్నట్లు పేర్కొంది.
Similar News
News February 5, 2026
గుండెపోటు రావొద్దంటే ఇవి తినాల్సిందే!

ధమనుల లోపలి గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవడంతో అవి బ్లాక్ అయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఓట్స్, అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. టమాటాల్లోని విటమిన్ C, E, ఫ్లేవనాయిడ్స్ వల్ల గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. క్యాబేజీ, బ్రోకలీ, కాలిఫ్లవరూ ఎంతగానో దోహదపడతాయి. చేపలు తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
News February 5, 2026
ఏప్రిల్-మేలో SIR నోటిఫికేషన్: CEO

TG: రాష్ట్రంలో ఏప్రిల్-మే నెలల్లో SIR నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఇవాళ ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కనీసం ఒక బూత్ లెవెల్ ఏజెంట్(BLA)ను నియమించుకోవాలని పార్టీలకు సూచించారు. 2025 జాబితాలో ఉన్న ఓటర్లను 2002 SIRలో నమోదైన ఓటర్లతో అనుసంధానించేలా టేబుల్ టాప్ మ్యాపింగ్ చేపట్టామని తెలిపారు.
News February 5, 2026
వెస్ట్ బైపాస్ నుంచే వెళ్లండి.. జగన్‌కు నోటీసులు

AP: రేపు వైసీపీ అధినేత జగన్ విజయవాడ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి వెళ్లి పరామర్శించనున్నారు. ఈ పర్యటనపై పోలీసులు తాజాగా జగన్‌కు నోటీసులు జారీ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెస్ట్ బైపాస్ రోడ్డులో వెళ్లాలని పేర్కొన్నారు. ఆదేశాలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. కాగా బుధవారం జగన్ గుంటూరులోని అంబటి రాంబాబు కుటుంబసభ్యులను పరామర్శించిన సంగతి తెలిసిందే.


