News October 31, 2024

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు సిద్ధమే.. కానీ: ఖాసిమ్

image

నస్రల్లా స్థానంలో హెజ్బొల్లా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నయీమ్ ఖాసిమ్ తొలిసారి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. ఆ దేశం దురాక్రమణను ఆపి తమకు అనుకూలమైన షరతులకు ఒప్పుకుంటే కాల్పుల విరమణకు సిద్ధమేనని తెలిపారు. అందుకోసం తామేమీ అడుక్కోబోమని స్పష్టం చేశారు. నస్రల్లా అనుసరించిన వార్ ప్లాన్‌కు కట్టుబడి ఉంటామన్నారు. కాగా ఈ కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండరని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

Similar News

News October 31, 2024

2 నుంచి ఏపీలో కొత్త కార్యక్రమం

image

AP: రాష్ట్రంలో వచ్చే నెల 2 నుంచి ‘మిషన్ పాట్‌హోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరంభిస్తోంది. సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రోడ్లకు ఇరువైపులా కంపచెట్ల తొలగింపు, గుంతలు పూడ్చడం, కల్వర్టుల నిర్మాణం వంటి పనులు చేపడతారు. ఇందుకోసం రూ.860 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. జనవరి నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించింది.

News October 31, 2024

దీపావళి: ఈ జాగ్రత్తలు మరవకండి

image

* లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే క్రాకర్స్ కొనండి.
* వాహనాల దగ్గర, కరెంట్ వైర్ల కింద, డ్రైనేజీ సమీపంలో బాణసంచా కాల్చడం ప్రమాదకరం.
* గాలి వీచే సమయంలో రాకెట్ల వంటి పైకి ఎగిరే టపాసులు కాల్చకండి.
* కాల్చిన బాణసంచాను నీరు నింపిన బకెట్‌లో వేయండి.
* ఆస్తమా శ్వాస సంబంధిత సమస్యలున్న వారు టపాసులకు దూరంగా ఉండండి. నాణ్యమైన మాస్క్‌లు ధరించండి.
> SHARE

News October 31, 2024

స్థలం, రేషన్‌కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు?

image

TG: దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది సొంత స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇల్లు ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ నిబంధన వల్ల ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇస్తే 30లక్షల దరఖాస్తులు బుట్టదాఖలు కావాల్సి ఉంటుంది.