News October 31, 2024
శ్రీ సత్యసాయి: ‘కేజీబీవీ టీచింగ్ పోస్టుల మెరిట్ లిస్ట్ వచ్చేసింది’

శ్రీ సత్యసాయి జిల్లాలో కేజీబీవీలో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు మెరిట్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలు బ్లాక్ స్పాట్‌లో ఉంచినట్లు డీఈవో కిష్టప్ప తెలిపారు. అభ్యంతరాలు ఉంటే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆధారాలతో అందజేయాలన్నారు. వచ్చిన అభ్యంతరాలు పరిశీలిస్తామని పేర్కొన్నారు.
Similar News
News November 10, 2025
కుష్టు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్

అనంతపురం జిల్లాలో కుష్టు వ్యాధిపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆనంద్ వైద్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి 30 వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటికి వెళ్లి కుష్టు వ్యాధిపై సర్వే చేపట్టాలన్నారు. వ్యాధి గ్రస్తులను గుర్తించి వైద్యం అందించాలన్నారు.
News November 10, 2025
స్వీకరించిన అర్జీలను త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అర్జీదారుల నుంచి కలెక్టర్ ఆనంద్ అర్జీలను స్వీకరించారు. స్వీకరించిన అర్జీలను సంబంధిత అధికారులతో విచారణ జరిపి త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. సమస్యల పరిష్కారంపై నిరంతర సమీక్ష ఉంటుందని వివరించారు.
News November 10, 2025
రైల్వే డీఆర్ఎంతో ఎంపీ, ఎమ్మెల్యే సమావేశం

గుంతకల్లు రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో సోమవారం డివిజన్‌లో అభివృద్ధి పనులపై ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తాతో సమావేశమయ్యారు. అనంతరం రైల్వే డివిజన్‌లో రైల్వే స్టాపింగ్స్, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్ట్, రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు మొదలైన అంశాలపై చర్చించారు.


