News October 31, 2024
OU డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రవేశాల గడువు పొడిగింపు

TG: ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు స్వీకరణ గడువును NOV 15 వరకు అధికారులు పొడిగించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల కోసం అప్లై చేసుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు 4,500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
వెబ్‌సైట్: http://oupgrrcde.com/
Similar News
News January 16, 2026
తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,43,400 వద్ద ట్రేడవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,31,450కు చేరుకుంది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ఏకంగా రూ.4,000 తగ్గి రూ.3,06,000 వద్ద కొనసాగుతోంది. కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే విషయమే అయినా ప్రాంతాలను బట్టి ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
News January 16, 2026
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు

స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 234 పాయింట్లు పెరిగి 83,619 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 25,712 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్-30 సూచీలో ఇన్ఫీ, టెక్ మహీంద్రా, M&M, అదానీ పోర్ట్స్, ట్రెంట్ షేర్లు లాభాల్లో.. ఎటర్నల్, భారతీ ఎయిర్‌టెల్, సన్ ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.313 వద్ద ప్రారంభమైంది.
News January 16, 2026
నేడు ఆవులను ఎలా పూజించాలంటే?

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.


