News October 31, 2024

KMM: తల్లితో వివాహేతర సంబంధం.. కూతురితో అసభ్య ప్రవర్తన 

image

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. పోలీసుల వివరాలు.. ఖమ్మం నుంచి ఓ మహిళ భర్త, కుమార్తెతో పాటు నగరానికి వచ్చింది. ఈమెకు అస్లాం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. అంతే కాకుండా కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 20, 2026

ఖమ్మం: బాలికపై లైంగికదాడికి యత్నం

image

ముదిగొండ మండలంలో దారుణం జరిగింది. మాయమాటలతో బాలికను కిడ్నాప్ చేసిన గోపి అనే యువకుడు, నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. అమ్మాయి కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ అశోక్ కేసు నమోదు చేశారు. నిందితుడిపై కిడ్నాప్, పోక్సో చట్టం కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

News January 20, 2026

ఖమ్మంలో పూడ్చిపెట్టిన మహిళ మృతదేహానికి పోస్టుమార్టం

image

ఖమ్మం రమణగుట్టలో సంచలనం రేపిన శైలజ(26) మరణంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అనారోగ్యంతో మరణించిందని నమ్మించి భర్త సురేందర్ హడావుడిగా అంత్యక్రియలు నిర్వహించగా, అనుమానం వచ్చిన మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ పర్యవేక్షణలో సోమవారం మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. వివాహేతర సంబంధం కోసమే ఇంజెక్షన్‌తో భార్యను హతమార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి.

News January 19, 2026

ఖమ్మం: ‘గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పనిచేయాలి’

image

సర్పంచ్ పదవిని కేవలం హోదాగా కాకుండా ఒక బాధ్యతగా భావించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహించిన శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు, వీధి దీపాలు, పచ్చదనం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రభుత్వ పథకాలు ప్రతి గడపకూ చేరేలా సర్పంచులు క్రియాశీలక పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.