News October 31, 2024

YSపై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

image

ఆస్తుల గొడవలతో పెద్దాయన(YSR) చరిత్రను నాశనం చేసేలా సొంత వారే ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ‘YSR ఉన్నప్పుడే జగన్ రూ. లక్ష కోట్ల సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీలో వైఎస్ భాగస్వామ్యం ఎంతనేది ఆలోచించాలి. వైఎస్ అక్రమ సంపాదనను ప్రజలకు పంచిపెట్టాలి. ఇది కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో చెప్పాలి’ అని ఆనం డిమాండ్ చేశారు.

Similar News

News October 29, 2025

నెల్లూరులో Photo Of The Day

image

నెల్లూరు జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రాత్రి, పగలు, వర్షం అనే తేడా లేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత వేజెండ్ల సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. నెల్లూరు రూరల్ కొండ్లపూడిలోని పునరావాస కేంద్రానికి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆ ఇద్దరూ అక్కడే భోజనం చేసి వారికి భరోసా కల్పించారు.

News October 28, 2025

నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

image

తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, అంగన్వాడీలు, జానియర్ కళాశాలకు బుధవారం సైతం సెలవు ఇస్తున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. విధిగా సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 28, 2025

శ్రీహరికోట: షార్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

సూళ్లూరుపేటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SHAR) నందు సైంటిస్ట్/ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – బి ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. వివిధ విభాగాలలో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://apps.shar.gov.in/sdscshar/result1.jsp వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 11.