News October 31, 2024
స్థలం, రేషన్‌కార్డు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు?

TG: దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది సొంత స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇల్లు ఇవ్వాలని భావిస్తోందని తెలుస్తోంది. ఈ నిబంధన వల్ల ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఒకవేళ స్థలం, రేషన్ కార్డున్న వారికే ఇస్తే 30లక్షల దరఖాస్తులు బుట్టదాఖలు కావాల్సి ఉంటుంది.
Similar News
News February 22, 2026
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్!

TG: రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాల్లో ఎండలు మండిపోతుండగా మరికొన్ని జిల్లాల్లో వర్షాలకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాబోయే 3-4 గంటల్లో ఆసిఫాబాద్, మహబూబాబాద్, వికారాబాద్, కామారెడ్డి, రంగారెడ్డి, భద్రాద్రి జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. మిగిలిన జిల్లాల్లో రాత్రివేళ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు.
News February 22, 2026
పెద్దవాళ్ల సబ్బునే పిల్లలకూ వాడుతున్నారా?

చిన్నపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అందుకే వారికి ఉపయోగించే ఉత్పత్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. చాలామంది పిల్లలకు తర్వాత పెద్దవాళ్ల సబ్బులే వాడుతుంటారు. కానీ ఇది సరికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల వారికి చిరాకు, అలర్జీ వచ్చే అవకాశముందంటున్నారు. పిల్లల ఉత్పత్తుల్లో పారబెన్స్, మినరల్ ఆయిల్స్, సల్ఫేట్స్ లేకుండా pH5.5% ఉండేలా చూసుకోవాలంటున్నారు.
News February 22, 2026
NIT దుర్గాపూర్‌లో ఉద్యోగాలు

NIT దుర్గాపూర్ 3 ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్(2), రీసెర్చ్ అసిస్టెంట్(1) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు మార్చి 7 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి పీజీ(సోషల్ సైన్స్), NET/M.Phil/PhD అర్హత ఉండాలి. రీసెర్చ్ అసిస్టెంట్‌కు నెలకు రూ.37,000, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్‌కు రూ.20,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nitdgp.ac.in


