News October 31, 2024

చిక్కడపల్లిలో ప్రముఖ సింగర్స్ సందడి..

image

త్యాగరాయ గానసభలో బుధవారం కళారవిందం సాంస్కృతిక వేదిక నిర్వహణలో సినీ గీతాలాపన కార్యక్రమం జరిగింది. ప్రముఖ గాయకుడు చింతలపూడి త్రినాథరావు జన్మదినం సందర్భంగా బ్రహ్మ వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు ఆత్మీయ సత్కారం చేశారు. కళారవిందం నిర్వాహకుడు శ్రీరామ్‌కుమార్, గాయకులు కశ్యప్, శ్యాంసుందర్, కోదండరాం, మధురగాన మయూఖ రేణుకారమేశ్, కృష్ణవేణి, అనూష, భార్గవి నాగరాజు, శ్రావణి పాల్గొన్నారు.

Similar News

News November 6, 2025

HYD: 10 మందికి ఊపిరినిచ్చిన ‘తండ్రి’

image

ఆ తండ్రి చనిపోయినా 10 మందిలో జీవిస్తున్నారు. మేడ్చల్ పరిధిలోని అత్వెల్లిలో గత వారం 44వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ నారెడ్డి భూపతి రెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. తుదిశ్వాస విడిచినా.. 10మందికి ఆయన ఊపిరినిచ్చారు. అవయవాలు దానం చేసి 10 మందికి ప్రాణం పోసినట్లు ఆయన కుమారుడు నారెడ్డి నవాజ్ రెడ్డి తెలిపారు.

News November 6, 2025

HYD: మీర్జాగూడ యాక్సిడెంట్.. యువకుడి మెసేజ్ వైరల్!

image

ట్రాఫిక్ రూల్స్‌పై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఓ యువకుడు చేసిన పని అందరినీ ఆలోచింపజేస్తోంది. ‘రూల్స్ ఎప్పుడూ ఇబ్బందిగా అనిపిస్తాయి. మన ప్రాణాలు కాపాడేవి అవే. త్వరగా వెళ్లాలంటే ముందు జాగ్రత్తగా వెళ్లాలి. మీ ఇంటికెళ్తూ వేరే ఇళ్లల్లో కన్నీళ్లు మిగిల్చకండి’ అంటూ మూసాపేట్ మెట్రో స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ఇలా ప్లకార్డులు పట్టుకొని కనిపించాడు. మీర్జాగూడ ఘటన నేపథ్యంలో యువకుడు ఇచ్చిన మెసేజ్ వైరలవుతోంది.

News November 6, 2025

HYD: TGCABలో JOBS.. నేడు లాస్ట్

image

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు నేటితో ముగుస్తుంది. HYDలో 32 స్టాఫ్ అసిస్టెంట్‌‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్‌ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి.
SHARE IT