News October 31, 2024
2 నుంచి ఏపీలో కొత్త కార్యక్రమం
AP: రాష్ట్రంలో వచ్చే నెల 2 నుంచి ‘మిషన్ పాట్‌హోల్ ఫ్రీ ఏపీ’ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆరంభిస్తోంది. సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా ఎస్.కోటలో రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టనున్నారు. అన్ని నియోజకవర్గాల్లో రోడ్లకు ఇరువైపులా కంపచెట్ల తొలగింపు, గుంతలు పూడ్చడం, కల్వర్టుల నిర్మాణం వంటి పనులు చేపడతారు. ఇందుకోసం రూ.860 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. జనవరి నాటికి పనులు పూర్తిచేయాలని ఆదేశించింది.
Similar News
News October 31, 2024
భారీ నష్టాలు.. రూ.3లక్షల కోట్లు లాస్!
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. దీపావళికి రాకెట్లలా దూసుకుపోతాయనుకుంటే తోకపటాకులా తుస్సుమనడం ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. మధ్యాహ్నం ఒంటిగంటకు బీఎస్ఈ సెన్సెక్స్ 523 పాయింట్లు పతనమై 79,420, ఎన్ఎస్ఈ నిఫ్టీ 137 పాయింట్ల నష్టంతో 24,203 వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో రూ.3లక్షల కోట్ల సంపద ఆవిరైంది. IT స్టాక్స్ ఘోరంగా క్రాష్ అవుతున్నాయి. TECHM, HCLTECH, INFY, TCS 3%మేర నష్టపోయాయి.
News October 31, 2024
టీజర్ రాకపోయేసరికి.. మెగా ఫ్యాన్స్ నిరాశ
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’ మేకర్స్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈరోజు మ.12.06గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ఉదయం చెప్పి తీరా సమయానికి ఇంకాస్త సమయం కావాలని ట్వీట్ చేశారు. దీంతో నిరాశకు గురైన కొందరు ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ కాదు ‘డేట్ ఛేంజర్’ అని సెటైర్లు వేస్తున్నారు. లేటైనా ఫర్వాలేదు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు.
News October 31, 2024
ఏ సినిమాకు వెళ్తున్నారు?
దీపావళి కానుకగా సినీ ప్రియుల కోసం ఈరోజు పలు సినిమాలు రిలీజయ్యాయి. వాటిల్లో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’, దుల్కర్ సల్మాన్ మూవీ ‘లక్కీ భాస్కర్’, శివకార్తికేయన్-సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ సినిమాలకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో చాలామంది ఈ దీపావళికి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సినిమాకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. మీరు సినిమాకు వెళ్తున్నారా? దేనికో కామెంట్ చేయండి.