News October 31, 2024

HYD: మీరు దీపావళి ఇలాగే జరుపుతారా..!

image

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలందరూ లక్ష్మీపూజలు నిర్వహిస్తారు. గ్రామాల్లో అయితే పొలాల్లోని జీనుగ, పుంటికూర (గోగునార)లతో కుటుంబసభ్యులకు దిష్టి తీయడం ఆనవాయితీ. చుట్టాలతో కలిసి కొత్త దుస్తులు ధరించి రంగురంగుల దీపాలు, పిండి వంటలు, పలు రకాల టపాకాయలు అబ్బో ఆ సంబరాలు మాటల్లో చెప్పలేం. నేడు చతుర్దశి కావడంతో ఉదయం భోగి మంగళహారతులు, సాయంత్రం నోము ఆచరిస్తారు. మీరు ఎలా జరుపుతారో కామెంట్ చేయండి.

Similar News

News October 31, 2024

HYD: టీటీడీ బోర్డు ఛైర్మ‌న్‌కు సీఎం అభినంద‌న‌లు

image

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) బోర్డు ఛైర్మన్‌గా నియ‌మితులైన బీఆర్ నాయుడుకు, బోర్డు స‌భ్యుల‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అభినంద‌న‌లు తెలిపారు. క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రస్వామి ఆల‌య ప‌విత్ర‌త‌ను, ఔన్న‌త్యాన్ని మ‌రింత‌గా పెంచేలా నూత‌నంగా నియ‌మితులైన ఛైర్మ‌న్‌, బోర్డు స‌భ్యులు కృషి చేయాల‌ని సీఎం ఆకాంక్షించారు.

News October 31, 2024

చిక్కడపల్లిలో ప్రముఖ సింగర్స్ సందడి..

image

త్యాగరాయ గానసభలో బుధవారం కళారవిందం సాంస్కృతిక వేదిక నిర్వహణలో సినీ గీతాలాపన కార్యక్రమం జరిగింది. ప్రముఖ గాయకుడు చింతలపూడి త్రినాథరావు జన్మదినం సందర్భంగా బ్రహ్మ వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు ఆత్మీయ సత్కారం చేశారు. కళారవిందం నిర్వాహకుడు శ్రీరామ్‌కుమార్, గాయకులు కశ్యప్, శ్యాంసుందర్, కోదండరాం, మధురగాన మయూఖ రేణుకారమేశ్, కృష్ణవేణి, అనూష, భార్గవి నాగరాజు, శ్రావణి పాల్గొన్నారు.

News October 31, 2024

HYD: మెడికల్‌ కళాశాలను దత్తత తీసుకోనున్న ‘ఆపి’

image

అమెరికాలోని ప్రఖ్యాత కేన్సర్‌ వైద్య నిపుణులు, ఆపి (అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ అఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌) అధ్యక్షుడు డాక్టర్‌ సతీష్‌ బుధవారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానంగా కేన్సర్‌ వ్యాప్తికి గల కారణాలతోపాటు నివారణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. కొన్ని మెడికల్‌ కాలేజీలను దత్తత తీసుకుని అవగాహన కల్పించేలా కార్యక్రమాలను రూపొందిస్తామన్నారు.