News October 31, 2024

చీటింగ్ కేసులో గంభీర్‌‌పై విచారణకు ఆదేశం

image

భారత క్రికెట్ జట్టు కోచ్ గౌతం గంభీర్‌‌పై ఓ చీటింగ్ కేసులో విచారణ జరిపేందుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. గంభీర్ పలు రియల్ ఎస్టేట్ సంస్థల జాయింట్ వెంచర్‌కు డైరెక్టర్, బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ఆ కంపెనీ తమను మోసం చేసిందంటూ అందులో ఫ్లాట్లు కొన్నవాళ్లు చీటింగ్ కేసు పెట్టారు. అటు గంభీర్ తన పరిధికి మించి కంపెనీ నుంచి డబ్బు అందుకున్నట్లు కోర్టు గుర్తించింది.

Similar News

News October 31, 2024

దీపావళి అంటే బండ్ల గణేశ్‌కు పూనకమే!

image

టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఎప్పటిలాగే దీపావళి సెలబ్రేషన్స్‌లో తన మార్క్‌ చూపించేందుకు సిద్ధమయ్యారు. భారీగా క్రాకర్స్ కొనుగోలు చేశారు. షాద్‌నగర్‌లోని తన ఇంటిముందు పరిచి వాటితో ఫొటోకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతున్నాయి. దీపావళి అంటే బండ్లన్నకు పూనకమే వచ్చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News October 31, 2024

టీస్పూన్ కన్నా ఎక్కువ ఉప్పు వాడుతున్నారా?

image

రోజుకు 2gms కన్నా తక్కువ సోడియం తీసుకుంటే పదేళ్లలో 3 లక్షల మరణాలను అడ్డుకోవచ్చని WHO తెలిపింది. ఒక టీస్పూన్ లేదా 5gms కన్నా తక్కువ ఉప్పు తీసుకోవాలని సూచించింది. దీంతో 17 లక్షల హార్ట్ అటాక్స్/స్ట్రోక్స్, 7 లక్షల కిడ్నీ రోగాలను అడ్డుకోవచ్చని వెల్లడించింది. పైగా $80 మిలియన్లను ఆదా చేసుకోవచ్చని తెలిపింది. అధిక, మధ్య ఆదాయ దేశాల్లో పరిమితికి మించి ఉప్పు వాడుతున్నారని వార్నింగ్ ఇచ్చింది. మరి మీరేమంటారు?

News October 31, 2024

‘అమరన్’ సినిమా రివ్యూ

image

భారత ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాన్ని డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి తెరపై అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీ రిలేషన్స్, దేశభక్తిని బ్యాలెన్స్ చేశారు. డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్, శివకార్తికేయన్ నటన సినిమాకు ప్లస్. మరోసారి సాయిపల్లవి సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అక్కడక్కడా స్టోరీ స్లో అవడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్.
RATING: 3/5