News October 31, 2024

TTD బోర్డులో జనసేన కోటా నుంచి ముగ్గురికి చోటు

image

జనసేన కోటాలో టీటీడీ పాలకమండలిలో ముగ్గురికి అవకాశం లభించింది. తెలంగాణకు చెందిన బొంగునూరి మహేందర్ రెడ్డి, పార్టీ వ్యవస్థాపక సభ్యురాలు అనుగోలు రంగశ్రీ, పవన్ కళ్యాణ్ సన్నిహితుడు ఆనంద్ సాయికి చోటు కల్పించారు. మహేందర్ రెడ్డి 2009 నుంచి యువరాజ్యంలో చురుగ్గా పని చేశారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ సాయి యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో ఆర్కిటెక్ట్‌గా పని చేశారు.

Similar News

News October 31, 2024

దీపావళి అంటే బండ్ల గణేశ్‌కు పూనకమే!

image

టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఎప్పటిలాగే దీపావళి సెలబ్రేషన్స్‌లో తన మార్క్‌ చూపించేందుకు సిద్ధమయ్యారు. భారీగా క్రాకర్స్ కొనుగోలు చేశారు. షాద్‌నగర్‌లోని తన ఇంటిముందు పరిచి వాటితో ఫొటోకు ఫోజులిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతున్నాయి. దీపావళి అంటే బండ్లన్నకు పూనకమే వచ్చేస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News October 31, 2024

టీస్పూన్ కన్నా ఎక్కువ ఉప్పు వాడుతున్నారా?

image

రోజుకు 2gms కన్నా తక్కువ సోడియం తీసుకుంటే పదేళ్లలో 3 లక్షల మరణాలను అడ్డుకోవచ్చని WHO తెలిపింది. ఒక టీస్పూన్ లేదా 5gms కన్నా తక్కువ ఉప్పు తీసుకోవాలని సూచించింది. దీంతో 17 లక్షల హార్ట్ అటాక్స్/స్ట్రోక్స్, 7 లక్షల కిడ్నీ రోగాలను అడ్డుకోవచ్చని వెల్లడించింది. పైగా $80 మిలియన్లను ఆదా చేసుకోవచ్చని తెలిపింది. అధిక, మధ్య ఆదాయ దేశాల్లో పరిమితికి మించి ఉప్పు వాడుతున్నారని వార్నింగ్ ఇచ్చింది. మరి మీరేమంటారు?

News October 31, 2024

‘అమరన్’ సినిమా రివ్యూ

image

భారత ఆర్మీ ఆఫీసర్ మేజర్ ముకుంద్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితాన్ని డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి తెరపై అద్భుతంగా చూపించారు. ఫ్యామిలీ రిలేషన్స్, దేశభక్తిని బ్యాలెన్స్ చేశారు. డైలాగ్స్, ఎమోషనల్ సీన్స్, మ్యూజిక్, శివకార్తికేయన్ నటన సినిమాకు ప్లస్. మరోసారి సాయిపల్లవి సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అక్కడక్కడా స్టోరీ స్లో అవడం, పెద్దగా ట్విస్టులు లేకపోవడం మైనస్.
RATING: 3/5