News October 31, 2024

విమానాలకు బాంబు బెదిరింపులు.. భారత్ కీలక నిర్ణయం

image

విమానాలకు వరుస బాంబు బెదిరింపులపై భారత్ ఎఫ్‌బీఐ, ఇంటర్ పోల్ సాయాన్ని కోరింది. ఖలిస్థానీలకు వీటితో సంబంధం ఉందేమోనన్న కోణంలోనూ దర్యాప్తు చేపట్టాలని ఎఫ్‌బీఐని అభ్యర్థించింది. కాగా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 410కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు తదితర ఎయిర్‌పోర్టులకు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.

Similar News

News November 17, 2024

మోదీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా: సిద్దరామయ్య

image

కర్ణాటక ప్రజల్ని దోచుకుని ఆ డబ్బును మహారాష్ట్రలో ఎన్నికల కోసం కాంగ్రెస్ తరలిస్తోందని PM మోదీ చేసిన ఆరోపణలపై కర్ణాటక CM సిద్దరామయ్య మండిపడ్డారు. ప్రధాని ఆ ఆరోపణల్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటానని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శపథం చేశారు. ‘మోదీ ఇష్టానుసారంగా అబద్ధాలాడి వెళ్లిపోతారు. తను చెప్పిన మాటలకు ప్రూఫ్ చూపించగలరా? నా సవాలు స్వీకరిస్తారా? ఆయనకెందుకు భయం?’ అని ప్రశ్నించారు.

News November 17, 2024

టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చేశారు!

image

పిల్లలు పిడుగులు అంటే ఇదేనేమో. టీచర్ మీద కోపంతో బాంబు తయారుచేసి పేల్చారు. హరియాణాలో ఓ సైన్స్ టీచర్ 12వ తరగతి విద్యార్థులను తిట్టారు. ఇది మనసులో పెట్టుకున్న స్టూడెంట్స్ ప్రాంక్ చేద్దామని యూట్యూబ్‌లో చూసి చిన్న బాంబు తయారుచేశారు. టీచర్ చైర్ కింద పెట్టి రిమోట్ కంట్రోల్‌తో పేల్చేశారు. ఈ ఘటనలో టీచర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేయగా టీచర్ క్షమించడంతో వదిలిపెట్టారు.

News November 17, 2024

రోహిత్ వెంటనే ఆసీస్ వెళ్లాలి: గంగూలీ

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు రోహిత్ శర్మ వీలైనంత త్వరగా ఆస్ట్రేలియా వెళ్లాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. ‘రోహిత్ అద్భుతమైన కెప్టెన్. ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత జట్టుకు అతడి లీడర్‌షిప్ అవసరం. రోహిత్ భార్య ఇప్పటికే బిడ్డకు జన్మనిచ్చారు కాబట్టి అతడు వెళ్లి పెర్త్ టెస్ట్ ఆడాలి’ అని సూచించారు. ఈ సిరీస్ తర్వాత రోహిత్ మళ్లీ ఆస్ట్రేలియా వెళ్లకపోవచ్చని గంగూలీ వ్యాఖ్యానించారు.