News October 31, 2024
ఈ స్వీట్ కేజీ ధర రూ.56,000
లక్నోలోని ‘ఛప్పన్ భోగ్’ షాపులో అమ్మే ‘ఎక్సోటికా’ స్వీట్ ఇండియాలోనే ఖరీదైన మిఠాయిగా గుర్తింపు పొందింది. కేజీ ధర రూ.56,000. అఫ్గాన్ నుంచి పిస్తా, తుర్కియే నుంచి హాజెల్ నట్స్, ఇరాన్ నుంచి మమ్రా బాదం, అమెరికా నుంచి బ్లూబెర్రీస్, సౌతాఫ్రికా నుంచి మకాడమియా గింజలను దిగుమతి చేసుకుంటారు. కొన్ని గ్రాముల బంగారాన్ని సైతం మిక్స్ చేసి స్వీట్ తయారు చేస్తారు. కేజీ బాక్సులో 10 గ్రా. బరువున్న 100 ముక్కలు ఉంటాయి.
Similar News
News November 17, 2024
పుష్ప-2 సరికొత్త రికార్డు
సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్-రష్మిక నటించిన పుష్ప-2 సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. ట్రైలర్ విడుదల కాకముందే ప్రీమియర్స్(DEC 4) కోసం అత్యంత వేగంగా 30+వేల టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా నిలిచింది. మొత్తంగా ఇప్పటికే 8.52 లక్షల డాలర్ల కలెక్షన్లను సాధించినట్లు మూవీ వర్గాలు వెల్లడించాయి. ఇవాళ సా.6.03 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకురానుంది.
News November 17, 2024
మణిపుర్‌కు వెళ్లండి మోదీజీ.. రాహుల్ మరోసారి వినతి
మణిపుర్‌లో పర్యటించి హింసాత్మక ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలని PM మోదీని రాహుల్ గాంధీ మరోసారి కోరారు. మణిపుర్‌లో మళ్లీ హింస చెలరేగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా హింస జరుగుతున్నా సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని దేశ ప్రజలు ఆశగా ఎదురుచూశారన్నారు. విదేశీ పర్యటనలకు మోదీ ప్రాధాన్యమిస్తుండడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.
News November 17, 2024
మోదీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా: సిద్దరామయ్య
కర్ణాటక ప్రజల్ని దోచుకుని ఆ డబ్బును మహారాష్ట్రలో ఎన్నికల కోసం కాంగ్రెస్ తరలిస్తోందని PM మోదీ చేసిన ఆరోపణలపై కర్ణాటక CM సిద్దరామయ్య మండిపడ్డారు. ప్రధాని ఆ ఆరోపణల్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటానని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శపథం చేశారు. ‘మోదీ ఇష్టానుసారంగా అబద్ధాలాడి వెళ్లిపోతారు. తను చెప్పిన మాటలకు ప్రూఫ్ చూపించగలరా? నా సవాలు స్వీకరిస్తారా? ఆయనకెందుకు భయం?’ అని ప్రశ్నించారు.