News October 31, 2024
క్రికెటర్ ఇంట్లో దొంగతనం
ఇంగ్లండ్ క్రికెట్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఇంట్లో దొంగతనం జరిగింది. అక్టోబర్ 17న ENG నార్త్ ఈస్ట్‌లోని తన ఇంట్లోకి మాస్క్‌లతో వచ్చిన కొందరు జువెలరీ, కొన్ని విలువైన వస్తువులు చోరీ చేశారని స్టోక్స్ వెల్లడించారు. చోరీ సమయంలో తన భార్య, ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారని, అదృష్టం కొద్దీ వాళ్లకు ఏమీ కాలేదని చెప్పుకొచ్చారు. అయినప్పటికీ ఈ ఘటన వాళ్లను మానసికంగా దెబ్బతీసిందని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2024
మణిపుర్‌కు వెళ్లండి మోదీజీ.. రాహుల్ మరోసారి వినతి
మణిపుర్‌లో పర్యటించి హింసాత్మక ప్రాంతాల్లో శాంతి స్థాపనకు కృషి చేయాలని PM మోదీని రాహుల్ గాంధీ మరోసారి కోరారు. మణిపుర్‌లో మళ్లీ హింస చెలరేగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏడాది కాలంగా హింస జరుగుతున్నా సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయని దేశ ప్రజలు ఆశగా ఎదురుచూశారన్నారు. విదేశీ పర్యటనలకు మోదీ ప్రాధాన్యమిస్తుండడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.
News November 17, 2024
మోదీ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా: సిద్దరామయ్య
కర్ణాటక ప్రజల్ని దోచుకుని ఆ డబ్బును మహారాష్ట్రలో ఎన్నికల కోసం కాంగ్రెస్ తరలిస్తోందని PM మోదీ చేసిన ఆరోపణలపై కర్ణాటక CM సిద్దరామయ్య మండిపడ్డారు. ప్రధాని ఆ ఆరోపణల్ని నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకొంటానని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో శపథం చేశారు. ‘మోదీ ఇష్టానుసారంగా అబద్ధాలాడి వెళ్లిపోతారు. తను చెప్పిన మాటలకు ప్రూఫ్ చూపించగలరా? నా సవాలు స్వీకరిస్తారా? ఆయనకెందుకు భయం?’ అని ప్రశ్నించారు.
News November 17, 2024
టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చేశారు!
పిల్లలు పిడుగులు అంటే ఇదేనేమో. టీచర్ మీద కోపంతో బాంబు తయారుచేసి పేల్చారు. హరియాణాలో ఓ సైన్స్ టీచర్ 12వ తరగతి విద్యార్థులను తిట్టారు. ఇది మనసులో పెట్టుకున్న స్టూడెంట్స్ ప్రాంక్ చేద్దామని యూట్యూబ్‌లో చూసి చిన్న బాంబు తయారుచేశారు. టీచర్ చైర్ కింద పెట్టి రిమోట్ కంట్రోల్‌తో పేల్చేశారు. ఈ ఘటనలో టీచర్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేయగా టీచర్ క్షమించడంతో వదిలిపెట్టారు.