News October 31, 2024
Way2 Special.. కరీంనగర్: శ్మశానంలో దీపావళి!

దీపావళిని సాధారణంగా ఇంట్లో అందరితో కలిసి టపాసులు కాల్చుతూ జరుపుకుంటారు. కానీ, మన కరీంనగర్ జిల్లాలో మాత్రం దాదాపు 6 దశాబ్ధాల నుంచి శ్మశాన వాటికలో జరుకుంటున్నారు. అదెక్కడో కాదండోయ్! నగరంలోని కార్ఖనగడ్డ వద్ద గల హిందూ శ్మశాన వాటికలో. ఓ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు మరణించిన తమ బంధువుల సమాధుల వద్ద నైవేద్యాలు, కొవ్వొత్తులు వెలిగించి, పిండివంటలు పెట్టి టపాసులు కాలుస్తూ దీపావళిని ఘనంగా జరుపుకుంటారు.
Similar News
News March 24, 2026
పారదర్శకమైన ఓటరు జాబితాకు సహకరించండి: కలెక్టర్ చిత్రా మిశ్రా

ఓటరు జాబితాలో అక్రమాలను తొలగించి, పారదర్శకత పెంచేందుకే ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) చేపట్టిందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డూప్లికేట్, మరణించిన, వలస వెళ్లిన ఓటర్ల తొలగింపుపై అపోహలు వద్దన్నారు. రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్లను నియమించుకుని ఈ ప్రక్రియకు సహకరించాలని కోరారు.
News March 24, 2026
నిబంధనల మేరకే గ్యాస్ సరఫరా జరగాలి: కలెక్టర్

గ్యాస్ సరఫరాలో నిబంధనలు ఉల్లంఘిస్తే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా హెచ్చరించారు. సీతారాంపూర్‌లోని భారత్ గ్యాస్ గోదామును ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి, గృహ వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
News March 24, 2026
సైదాపూర్: తాటిచెట్టుపై నుంచి జారిపడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

సైదాపూర్ మండలంలోని ఘనపూర్ గ్రామానికి చెందిన గీతా కార్మికుడు తాటిచెట్టుపై నుంచి కిందపడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘనపూర్ గ్రామానికి చెందిన ఆకుల వేణు ఉదయం తాటిచెట్టు ఎక్కి దిగుతుండగా ప్రమాదవ శాత్తు జారీ కింద పడడంతో వెన్నుపూసతో పాటు, పలు చోట్ల తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయనను చికిత్స నిమిత్తం హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


