News October 31, 2024

ఆ ఆస్తిని పేద పిల్లలకు పంచాలి: మంత్రి సత్యకుమార్

image

AP: అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తుల సమస్యను ఇద్దరు తోడుదొంగలు అంతర్జాతీయ సమస్యగా మార్చారని మంత్రి సత్యకుమార్ ఎద్దేవా చేశారు. తనకు రక్షణ కల్పించాలన్న చెల్లి కొత్త నాటకం మాయాబజార్‌ను తలపిస్తోందని ట్వీట్ చేశారు. ‘అక్రమంగా సంపాదించిన వ్యక్తులను సమాజం బహిష్కరించాలి. ఆస్తులను నలుగురు పిల్లలకు కాదు, కోట్లాది పిల్లలకు పంచాలి. అప్పుడే నిజమైన దీపావళి’ అని పేర్కొన్నారు.

Similar News

News October 31, 2024

నవంబర్ 9న ‘గేమ్ ఛేంజర్’ టీజర్

image

మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై చిత్ర యూనిట్ అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 9న ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తామని రైలు పట్టాలపై రామ్‌చరణ్ చొక్కా లేకుండా కూర్చున్న ఫొటోను పంచుకుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

News October 31, 2024

పువ్వులతోనే దేవుడిని ఎందుకు పూజించాలి?

image

మనం నిత్యం భగవంతుడికి పువ్వులతోనే పూజ చేస్తుంటాం. ఏ పూజ అయినా పుష్పాలదే ప్రాధాన్యత. పుష్పాల్లో సర్వ దేవతలు ఉంటారని ప్రతీతి. పువ్వుల్లో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నమవుతారట. దేవుడికి పువ్వుల సువాసన అంటే మహా ఇష్టమని అంటారు. పుష్పం త్రివర్గ సాధనం కాబట్టి సంపద, స్వర్గం, మోక్షాన్ని కలిగిస్తుందని భక్తుల నమ్మకం. దేవుళ్లకు ఇష్టమైన పూలతో పూజ చేస్తే కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

News October 31, 2024

మహారాష్ట్ర: ఆ 12 సీట్ల‌పై MVAలో అలజడి

image

మ‌హారాష్ట్రలో విప‌క్ష మ‌హావికాస్ అఘాడీలో 12 సీట్లు కాక‌రేపుతున్నాయి. నామినేష‌న్ల గ‌డువు పూర్త‌వ్వ‌డంతో 288 స్థానాల్లో 12 స్థానాల్లో MVAలోని రెండేసి పార్టీలు నామినేష‌న్లు వేశాయి. దీంతో ఫ్రెండ్లీ పోరు తప్పదా? అనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తాయి. ఇప్ప‌టికే 2 కూట‌ములు, 6 పార్టీల‌ గుర్తుల విష‌యంలో ప్ర‌జ‌ల్లో గందర‌గోళం ఉంది. నామినేషన్ల ఉపసంహరణలోపు సమస్యల్ని పరిష్కరించుకుంటామని MVA నేతలు చెబుతున్నారు.