News October 31, 2024

టీజర్ రాకపోయేసరికి.. మెగా ఫ్యాన్స్ నిరాశ

image

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ ఛేంజర్’ మేకర్స్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈరోజు మ.12.06గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ఉదయం చెప్పి తీరా సమయానికి ఇంకాస్త సమయం కావాలని ట్వీట్ చేశారు. దీంతో నిరాశకు గురైన కొందరు ఫ్యాన్స్ ‘గేమ్ ఛేంజర్’ కాదు ‘డేట్ ఛేంజర్’ అని సెటైర్లు వేస్తున్నారు. లేటైనా ఫర్వాలేదు బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలని మరికొందరు కోరుతున్నారు.

Similar News

News October 31, 2024

Investing: ఈ వయసు వారే అత్యధికం

image

స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారిలో 30 ఏళ్లలోపు వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. వీరు 2018లో 22.9% ఉండ‌గా Sep, 2024 నాటికి వారి సంఖ్య 40 శాతానికి చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ట్రెండ్‌ వెల్త్ క్రియేష‌న్‌పై ఆర్థిక అవ‌గాహ‌న‌తో పెట్టుబ‌డులు పెట్టాల‌న్నయువ‌త ఉత్సాహానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. అయితే, 30 ఏళ్లు పైబడిన వారిలో ఇన్వెస్టింగ్ ధోర‌ణి క్ర‌మంగా త‌గ్గుతున్నట్టు NSE నివేదిక‌ వెల్ల‌డించింది.

News October 31, 2024

తిరోగమనంలో విద్యారంగం: YCP

image

ఏపీలో సర్కార్ విద్యకి CM చంద్రబాబు మంగళం పాడారని YCP మండిపడింది. దీపావళి కానుకగా పేదింటి బిడ్డల్ని నాణ్యమైన చదువుకి బాబు దూరం చేశారంది. ‘ఇంగ్లీషు మీడియం, CBSE, టోఫెల్ రద్దు. తల్లికి వందనమంటూ అమ్మఒడికి ఎగనామం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి తిలోదకాలు. అధ్వాన్నంగా మారిన స్కూళ్లు, హాస్టళ్లలో కలుషిత ఆహారంతో విద్యార్థుల ఆస్పత్రిపాలు. కూటమి 5 నెలల పాలనలో తిరోగమనంలో విద్యారంగం’ అని Xలో విమర్శలు గుప్పించింది.

News October 31, 2024

ALERT.. కాసేపట్లో వర్షం

image

తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.