News October 31, 2024
IPLలో అసలు ఈరోజు ఏం జరగనుంది?

IPL2025 కోసం రిటెన్షన్, రైట్ టు మ్యాచ్ అనే 2 ఆప్షన్లను ఫ్రాంచైజీలు వినియోగించుకోనున్నాయి. అంటే ఇప్పటి వరకు తమ జట్లలో ఉన్న క్రికెటర్లలో గరిష్ఠంగా ఆరుగురిని తమతో ఉంచుకొని మిగిలిన వారిని మెగా వేలంలోకి వదలాల్సి ఉంటుంది. కాగా అన్ని జట్లు ఇప్పటికే తమ లిస్టును ప్రిపేర్ చేసుకున్నాయి. సాయంత్రం 5గంటల్లోపు ఆ లిస్టును ప్రకటించనున్నాయి. దీంతో ఎవరు వేలంలోకి వస్తారు? ఎవరు రిటైన్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
Similar News
News February 21, 2026
క్రిస్ క్యాపిటల్ చేతికి నోవార్టిస్

స్విస్ హెల్త్‌కేర్ దిగ్గజం ‘నోవార్టిస్ ఏజీ’ భారత్‌లో వ్యాపారానికి ఫుల్‌స్టాప్ పెట్టనుంది. నోవార్టిస్ ఇండియా లిమిటెడ్‌లో ఉన్న 70.68% వాటాను క్రిస్ క్యాపిటల్‌కు విక్రయించనుంది. దీని విలువ రూ.1,446 కోట్లు కాగా ఈ ఏడాది చివరి నాటికి డీల్ పూర్తి కానుంది. దీంతో నోవార్టిస్‌లోని 26% వాటా కొనుగోలుకు క్రిస్ క్యాపిటల్ ఓపెన్ ఆఫర్ ప్రకటించనుంది. అందుకు షేరుకు రూ.860.64 చొప్పున రూ.552 కోట్లు వెచ్చిస్తోంది.
News February 21, 2026
గర్భసంచి కిందికి ఎందుకు జారుతుందంటే?

మహిళల్లో పెల్విక్ ఫ్లోర్ కండరాలు, స్నాయువులు గర్భశయానికి సపోర్ట్ ఇవ్వనప్పుడు, ఎక్కువగా సాగి, బలహీనమైనప్పుడు గర్భాశయ ప్రోలాప్స్ వస్తుంది. ఈ సమయంలో గర్భాశయం యోనిలోకి ప్రవేశించడం, పొడుచుకు రావడం వల్ల మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. మెనోపాజ్, ఎక్కువ సాధారణ ప్రసవాలు జరిగితే ఈ సమస్య వస్తుంది. ఈ సమస్యకి ట్రీట్‌మెంట్ అనేది మహిళ సమస్య, ఆమె వయసు, ఇతర కారణాలపై ఆధారపడి ఉంటుంది.
News February 21, 2026
ఇది రేవంత్ చేతకానితనానికి నిదర్శనం: KTR

TG: SLBC సొరంగం కూలి ఏడాది కావొస్తున్నా కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో ప్రభుత్వం విఫలమైందని KTR విమర్శించారు. ‘మృతదేహాల వెలికితీతలో, సొరంగం పనుల్లో పురోగతి లేకపోవడం రేవంత్ చేతకానితనానికి నిదర్శనం. కాంగ్రెస్ నేతలు కమీషన్లపై పెట్టే శ్రద్ధ.. ప్రజా శ్రేయస్సుపై పెడితే ఇలాంటి విషాదాలు పునరావృతం కావు’ అని ట్వీట్ చేశారు. 2025 FEB 22న జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.


