News October 31, 2024

జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్

image

రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రావణ్‌ని కలెక్టర్ సస్పెండ్ చేశారు. బాణసంచా దుకాణాల పర్మిషన్స్, రెన్యువల్ తదితర అంశాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కలెక్టర్ ఆనంద్ సస్పెండ్ చేశారు. జిల్లాలోని కొంతమంది బాణాసంచా దుకాణాల యజమానులు కలెక్టర్, ఆర్డీవోల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News January 13, 2026

నెల్లూరు: పోలీసుల సంక్రాంతి సందడి ఇలా..!

image

నెల్లూరు జిల్లా చెముడుగుంటలోని డీటీసీలో సంక్రాతి వేడుకలు నిర్వహించారు. ట్రైనీ కానిస్టేబుళ్లతో కలిసి ఎస్పీ అజిత వేజెండ్ల భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించారు. నిత్యం శిక్షణలతో కనిపించే డీటీసీ మైదానం పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. ఆ తరహాలో ప్రత్యేకంగా అలంకరించారు. అరిసెలు, ఉప్పు చెక్కలు వంటి పిండి వంటకాలు చేసి పంచి పెట్టారు.

News January 13, 2026

నెల్లూరు వాసికి కీలక పోస్టింగ్

image

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరుకు చెందిన ఏటూరు భాను ప్రకాష్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా 2004 నుంచి అక్కడ పనిచేస్తున్నారు. డిప్యుటేషన్‌పై మన రాష్ట్రంలోనూ కొంతకాలం విధులు నిర్వర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో నెల్లూరు జిల్లా వాసి పదవి పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.

News January 13, 2026

నెల్లూరు జిల్లాలో చైనా మాంజాలు నిషేధం: SP

image

నెల్లూరు జిల్లాలో చైనా మాంజా వాడకాన్ని నిషేధిస్తున్నామని ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల వెల్లడించారు. ‘సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ. అందరూ సంతోషంగా పతంగులు ఎగరవేయాలి. చైనా మాంజా(దారం) వాడకంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ దారాలు అమ్మడం చట్టరీత్యా నేరం. ఎక్కడైనా ఆ మాంజాను విక్రయిస్తే 100కు డయల్ చేయండి’ అని ఎస్పీ కోరారు.