News October 31, 2024

రోడ్లపై బాణసంచా పేల్చడం నిషేధం

image

TG: దీపావళి సందర్భంగా పబ్లిక్ రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో బాణసంచా కాల్చడం నిషేధమని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పేల్చాలని చెప్పారు. ఆ తర్వాత పేల్చినవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ శబ్దంతో పేలే టపాసులను కాల్చడంపై నిషేధం విధించినట్లు తెలిపారు. ఈ నిబంధనలు నేటి నుంచి వచ్చే నెల 2 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

Similar News

News January 14, 2026

ఫోన్ల ధరలు 30% పెరిగే ఛాన్స్: నథింగ్ CEO

image

స్మార్ట్ ఫోన్ల ధరలు ఈ ఏడాది 30% లేదా అంతకంటే ఎక్కువే పెరగొచ్చని నథింగ్ కంపెనీ CEO కార్ల్ పై అంచనా వేశారు. ఒకవేళ ధరలు పెంచకపోతే స్పెసిఫికేషన్స్‌ను తగ్గించాల్సి వస్తుందన్నారు. మెమరీ, డిస్ ప్లే ధరలు కొన్నేళ్లుగా తగ్గుతూ వచ్చాయని, ఇప్పుడు మెమరీ ధరలు 3 రెట్లు పెరిగాయని చెప్పారు. AI వల్ల స్మార్ట్ ఫోన్లలో వాడే మెమరీ చిప్స్‌కు డిమాండ్ ఏర్పడిందని, నథింగ్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్ల ధరలు పెరుగుతాయన్నారు.

News January 14, 2026

విశాఖ ఎయిర్ పోర్టు నుంచి డొమెస్టిక్ సర్వీసులు నడపాలి: MLA

image

AP: భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభమైనా విశాఖ నుంచి కొన్ని డొమెస్టిక్ విమాన సర్వీసులకైనా అవకాశమివ్వాలని MLA విష్ణుకుమార్ రాజు కోరారు. ‘VSP నుంచి ఏటా 30L మంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. భోగాపురం చేరాలంటే 2 గంటల సమయం, ట్యాక్సీలకు ₹4500 వరకు ఖర్చు అవుతుంది. విజయవాడకు వందేభారత్ ట్రైన్లో 4 గంటల్లో చేరుకోవచ్చు. అదే భోగాపురం నుంచి విమానంలో వెళ్లాలంటే 6గంటలు పడుతుంది. ఖర్చూ ఎక్కువే’ అని పేర్కొన్నారు.

News January 14, 2026

కాసేపట్లో వర్షం..

image

TG: హైదరాబాద్‌లో కాసేపట్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. పటాన్‌చెరు, లింగపల్లి, కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మేడ్చల్, నిజాంపేట్, కుత్బుల్లాపూర్, అల్వాల్, గాజులరామారం ప్రాంతాల్లో రాబోయే 2 గంటల్లో వాన పడుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే వికారాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.