News October 31, 2024
నవంబర్ 9న ‘గేమ్ ఛేంజర్’ టీజర్
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ సినిమాపై చిత్ర యూనిట్ అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 9న ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తామని రైలు పట్టాలపై రామ్‌చరణ్ చొక్కా లేకుండా కూర్చున్న ఫొటోను పంచుకుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ 2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
Similar News
News October 31, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.
News October 31, 2024
హైదరాబాద్‌ను అమరావతి బీట్ చేస్తుందా? KTR రిప్లై ఇదే
TG: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు Xలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. చంద్రబాబు నేతృత్వంలో అమరావతి ఐటీ సిటీగా బలపడి హైదరాబాద్‌ను అధిగమిస్తుందా? అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ ‘చంద్రబాబు సాధించాలనే తపన ఉన్న లీడర్ కానీ HYD స్వంతగానే అభివృద్ధి చెందింది. గతంతో పోలిస్తే ఐటీలో బెంగళూరును దాటేసింది. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో మున్ముందు ఏం జరుగుతుందో తెలియదు’ అని అన్నారు.
News October 31, 2024
నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే..
➢ఆర్బీఐ డొమెస్టిక్ మనీ ట్రాన్స్ఫర్ రూల్ అమలు
➢రైలు టికెట్ అడ్వాన్స్ బుకింగ్ 60 రోజులకు తగ్గింపు
➢SBI క్రెడిట్ కార్డు ఫైనాన్స్ ఛార్జీలు 3.75శాతానికి పెంపు
➢ICICI క్రెడిట్ కార్డు ఫీజు, క్రెడిట్ కార్డు రివార్డు పాయింట్స్ విధానంలో మార్పులు(నవంబర్ 15 నుంచి అమలు)
➢ఇండియన్ బ్యాంక్ ఎఫ్డీ స్కీమ్ గడువు Nov 30 వరకు పెంపు