News October 31, 2024

తిరోగమనంలో విద్యారంగం: YCP

image

ఏపీలో సర్కార్ విద్యకి CM చంద్రబాబు మంగళం పాడారని YCP మండిపడింది. దీపావళి కానుకగా పేదింటి బిడ్డల్ని నాణ్యమైన చదువుకి బాబు దూరం చేశారంది. ‘ఇంగ్లీషు మీడియం, CBSE, టోఫెల్ రద్దు. తల్లికి వందనమంటూ అమ్మఒడికి ఎగనామం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి తిలోదకాలు. అధ్వాన్నంగా మారిన స్కూళ్లు, హాస్టళ్లలో కలుషిత ఆహారంతో విద్యార్థుల ఆస్పత్రిపాలు. కూటమి 5 నెలల పాలనలో తిరోగమనంలో విద్యారంగం’ అని Xలో విమర్శలు గుప్పించింది.

Similar News

News October 31, 2024

రాజకీయాలు వదిలేద్దామనుకున్నా: KTR

image

తన 18 ఏళ్ల రాజకీయ జీవితంలో కుటుంబ సభ్యులు, పిల్లలు సైతం ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ తెలిపారు. ఒక దశలో రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకున్నానని అయితే పోరాడాలని నిర్ణయించుకుని నిలబడినట్లు చెప్పారు. Xలో నెటిజన్ల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ప్రస్తుత రాజకీయాలు ఏం బాలేవని అన్నారు. పాలిటిక్స్‌లో కుటుంబ సభ్యుల్ని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదని, తాము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేయలేదని చెప్పారు.

News October 31, 2024

ఉచిత గ్యాస్ సిలిండర్.. మీరు ఇలా చేశారా?

image

APలో రేపటి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రారంభం కానుంది. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్, ఆధార్ ఉన్న వారు అర్హులు. రేషన్ కార్డుకు ఈ-కేవైసీ తప్పనిసరి. లేదంటే గ్యాస్ ఏజెన్సీల వద్ద లింక్ చేసుకోవాలి. ఆధార్-బ్యాంక్ ఖాతా లింక్ అయ్యి ఉండాలి. అలా లింకైన అకౌంట్లోనే సిలిండర్ కోసం ప్రభుత్వం ఇచ్చే డబ్బులు 48 గంటల్లోగా జమ అవుతాయి. ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తారు.

News October 31, 2024

దీపావళి: ఆ గ్రామంలో రావణుడి ఆత్మశాంతికి యజ్ఞం

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిశ్రక్ గ్రామంలో దీపావళి పండుగను జరుపుకోరు. రావణాసురుడు ఇక్కడే పుట్టారని ఇక్కడి ప్రజలు నమ్మడమే ఇందుకు కారణం. రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు ఇక్కడే పుట్టి లంకకు వెళ్లి రాజ్యాన్ని పాలించారని నమ్ముతుంటారు. ఇక్కడి పురాతన శివలింగాన్ని రావణుడు, ఆయన తండ్రి విశ్రవసుడు పూజించారనేది స్థానిక కథనం. దీపావళి రోజున బాణసంచా కాల్చడానికి బదులు రావణుడి ఆత్మశాంతి కోసం యజ్ఞాలు చేస్తుంటారు.