News October 31, 2024
మద్యం ధరల నిర్ణయంపై టెండర్ కమిటీ: మంత్రి కొల్లు
AP: ప్రజలకు నాణ్యమైన మద్యం అందించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గీత కార్మికులకు 340 మద్యం దుకాణాలకు వారం రోజుల్లో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. నవంబర్ 15లోపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మద్యం ధరల స్థిరీకరణకు త్వరలో టెండర్ కమిటీ వేస్తామని తెలిపారు. ఈ కమిటీ డిస్టిలరీస్‌తో చర్చించి ధరలు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు.
Similar News
News November 16, 2024
రేపు నారావారిపల్లెలో రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు
AP: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు స్వగ్రామం నారావారిపల్లెలో జరుగుతాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చంద్రబాబు రేపు ఇక్కడకు రానున్నారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులు, నందమూరి కుటుంబసభ్యులు కూడా వస్తారు. కాగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రామ్మూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే.
News November 16, 2024
మట్కా: రెండు రోజుల కలెక్షన్లు ఎంతంటే?
పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘మట్కా’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో రూ.1.10 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. విడుదలకు ముందు రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినా బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో రూ.19 కోట్లు రావాలని పేర్కొన్నాయి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు.
News November 16, 2024
ఇద్దరు పిల్లలు ఉంటేనే ఎన్నికల్లో పోటీ: చంద్రబాబు
AP: ఒకప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రకటించారని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేసేలా నిబంధన పెట్టాలని అభిప్రాయపడ్డారు. ‘మన దేశంలో జనాభా పెంచాలి. 30, 40 కోట్ల మంది విదేశాలకు వెళ్లి ఆదాయం తీసుకురావాలి. ఒకప్పుడు బ్రిటిష్ వారు ఏలినట్లు, ఇప్పుడు మనం ఏలాలి. ఇందుకు పాపులేషన్ మేనేజ్‌మెంట్ చేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.