News October 31, 2024
చిన్నారికి నామకరణం చేసిన సోమిరెడ్డి
నెల్లూరు నగర పరిధిలోని అల్లీపురానికి చెందిన ఓ మహిళకు గురువారం పురిటినొప్పులు వచ్చాయి. 108 అంబులెన్స్‌కి సమాచారం ఇచ్చిన కుటుంబసభ్యులు ఆమెను తీసుకుని ఆటోలో ఎదురెళ్లారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి నివాసం వద్ద ఆటోలో నుంచి అంబులెన్స్‌లోకి ఎక్కించి అక్కడే ప్రసవం చేశారు. సోమిరెడ్డితో పాటు ఆయన కోడలు శృతిరెడ్డి చిన్నారిని ఎత్తుకున్నారు. దీపావళి నాడు పుట్టిన చిన్నారికి ‘సంతోషి’గా నామకరణం చేశారు.
Similar News
News October 31, 2024
చిల్లకూరు మండలంలో దారుణ హత్య
చిల్లకూరు మండలం కడివేడు అరుంధతీయవాడలో గురువారం సాయంత్రం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు పాత కక్షలే కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. మద్యం మత్తులో ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. హంతకులను కనిపెట్టేందుకు డాగ్స్‌ను కూడా రప్పిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News October 31, 2024
జూనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆర్డీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రావణ్‌ని కలెక్టర్ సస్పెండ్ చేశారు. బాణసంచా దుకాణాల పర్మిషన్స్, రెన్యువల్ తదితర అంశాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై కలెక్టర్ ఆనంద్ సస్పెండ్ చేశారు. జిల్లాలోని కొంతమంది బాణాసంచా దుకాణాల యజమానులు కలెక్టర్, ఆర్డీవోల పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు.
News October 31, 2024
కావలిలో విషాదం.. తల్లి, కూతురు దుర్మరణం
కావలిలోని రాజావీధిలో నివాసం ఉంటున్న గార్నపూడి శిరీష, ఆమె తల్లి నత్తల వజ్రమ్మను రైలు ఢీ కొట్టడంతో ఇద్దరూ మృతి చెందారు. ఈ తెల్లవారు జామున తల్లి వజ్రమ్మను విజయవాడ ప్యాసింజరు ఎక్కించేందుకు శిరీష కావలి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. 3వ ప్లాట్ ఫారం వజ్రమ్మ ఎక్కలేక పోయారు. తల్లిని పట్టాలు దాటించేందుకు శిరీష ప్రయత్నించగా అప్పటికే వేగంగా వచ్చిన కోయంబత్తూరు ఎక్స్ ప్రెస్ రైలు ఇద్దరిని ఢీ కొట్టింది.