News October 31, 2024
హైదరాబాదీ పేసర్‌కు ఆర్సీబీ నో ఛాన్స్!
టీమ్‌ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదు. కెప్టెన్ డుప్లిసెస్, మ్యాక్స్‌వెల్, గ్రీన్‌లను సైతం వేలంలోకి వదిలేసింది. రూ.37 కోట్లు వెచ్చించి ముగ్గురిని రిటైన్ చేసుకుంది. కాగా ఐపీఎల్ 2024లో రూ.7కోట్లకు సిరాజ్‌ను RCB కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన సిరాజ్ 15 వికెట్లు తీసి 496 పరుగులిచ్చారు. మరి మెగా వేలంలో ఈ హైదరాబాదీ పేసర్ ఎంత పలుకుతాడో కామెంట్ చేయండి.
Similar News
News November 16, 2024
మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు?: కేటీఆర్
TG: మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మూసీ ప్రక్షాళనకు రూ.1.50 లక్షల కోట్లు ఎందుకని నిలదీశారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ ‘కేసీఆర్, బీఆర్ఎస్‌ను ఫినిష్ చేస్తామని రేవంత్ అంటున్నారు. గతంలో ఇలా అన్న వాళ్లే తెలంగాణలో లేకుండా పోయారని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నట్లే’ అని స్పష్టం చేశారు.
News November 16, 2024
సనాతనాన్ని రక్షించడానికే శివసేన- జనసేన: పవన్
శివాజీ మహారాజ్ గడ్డపై అడుగుపెట్టినందుకు సంతోషంగా ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతనాన్ని రక్షించడానికే శివసేన- జనసేన ఆవిర్భవించాయని చెప్పారు. ఈ 2పార్టీలు అన్యాయంపై పోరాడతాయని తెలిపారు. జాతీయభావం, ప్రాంతీయతత్వం తమ పార్టీల సిద్ధాంతం అని వివరించారు. మహాయుతి తరఫున మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో ప్రచారం నిర్వహించిన పవన్ బాల సాహెబ్ ఠాక్రే నుంచి ఎంతో నేర్చుకున్నానని వెల్లడించారు.
News November 16, 2024
మ్యాక్సీ అరుదైన రికార్డు
T20 క్రికెట్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డు సృష్టించారు. అతి తక్కువ బంతుల్లో(6,505) 10,000 పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో పొలార్డ్(6,640), క్రిస్ గేల్(6,705), అలెక్స్ హేల్స్(6,774), జోస్ బట్లర్(6,928) ఉన్నారు. ఓవరాల్‌గా పదివేల పరుగులు పూర్తిచేసుకున్న 16వ ఆటగాడిగా మ్యాక్సీ ఘనత సాధించారు.