News October 31, 2024
ఇంటింటా BPL.. అప్పట్లో ఓ సంచలనం
1963 కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఆర్మీకి ప్యానల్ మీటర్లు సరఫరా చేయడానికి TP గోపాలన్ నంబియార్ బ్రిటిష్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ (BPL)ను స్థాపించారు. అనంతరం ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీని సంస్థ ప్రారంభించింది. దీంతో 1990 దశకంలో ప్రతి ఇంటా మనకు BPL టీవీలు కనిపించేవి. అలా ప్రతి ఇంట్లో వస్తువు స్థాయికి సంస్థ ఎదిగింది. నెలలో 10 లక్షల TVల విక్రయంతో BPL అప్పట్లో సంచలనం సృష్టించింది.
Similar News
News November 16, 2024
నాకు ఐఐటీ చదివే కొడుకున్నాడు: తమన్
సంగీత దర్శకుడు తమన్ తన పుట్టినరోజు సందర్భంగా పలు ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. తన కుమారుడు ఐఐటీలో చదువుతున్నారని వెల్లడించారు. ‘మా అబ్బాయి ఐఐటీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నా సోషల్ మీడియా ఖాతాలను, సంగీత సంబంధిత వ్యవహరాలను నా భార్యే చూసుకుంటుంది. నాకు డబ్బు కావాలన్నా తననే అడుగుతాను. మా కుటుంబమంతా ఇప్పుడిప్పుడే హైదరాబాద్‌కు షిఫ్ట్ అవుతున్నాం’ అని తెలిపారు.
News November 16, 2024
జో బైడెన్‌లాగే మోదీకీ మతిపోయిందేమో: రాహుల్
అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌లానే ప్రధాని మోదీకి మెమరీ లాస్ అయిందని LoP రాహుల్ గాంధీ సెటైర్ వేశారు. ‘మోదీజీ స్పీచ్ విన్నట్టు నా చెల్లి నాతో చెప్పింది. ఈ మధ్యన మేమేం మాట్లాడినా ఆయనా అదే చెప్తున్నారని పేర్కొంది. బహుశా ఆయనకు మెమరీ లాస్ అయిందేమో. జోబైడెన్ సైతం జెలెన్ స్కీ వస్తే రష్యా ప్రెసిడెంట్ పుతిన్ వచ్చినట్టు చెప్పారు. ఆయనలాగే మన ప్రధానికీ మతి పోయిందేమో’ అని మహారాష్ట్ర సభలో అన్నారు.
News November 16, 2024
BREAKING: చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి కన్నుమూత
ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు, హీరో నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు(72) కన్నుమూశారు. కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న చంద్రబాబు ఢిల్లీ నుంచి బయల్దేరారు. ఇప్పటికే మంత్రి నారా లోకేశ్ విజయవాడ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా రామ్మూర్తి 1994-99 మధ్య చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు.