News October 31, 2024
మరో ఐదు రోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు Nov 5న పోలింగ్ జరగనుంది. అమెరికన్లు నేరుగా అధ్యక్షుడికి ఓటు వేయరు కాబట్టి <<14452559>>ఎలక్టర్లను<<>> ఎన్నుకుంటారు. పోలింగ్ తరువాత అధ్యక్ష అభ్యర్థి గెలుపుపై స్పష్టత వచ్చినా Dec 16న ఎలక్టర్లు కొత్త అధ్యక్ష, ఉపాధ్యక్షుల్ని ఎన్నుకుంటారు. ఇది అమెరికా అధ్యక్షుడి అసలైన ఎన్నిక. అనంతరం ఈ ఫలితాలను Jan 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో అధికారికంగా ప్రకటిస్తారు.
Similar News
News November 1, 2024
బాబు వచ్చాడు.. ప్రజల భవిష్యత్తు అంధకారం: VSR
AP: చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల ధరలు కొండెక్కాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ‘ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది. పేద మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నా CBN పట్టించుకోవట్లేదు. మరోవైపు సామాన్యుడిపై విద్యుత్ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నారు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారంటీ నినాదం ఇప్పుడు బాబు వచ్చాడు-భవిష్యత్తు అంధకారంగా మారిపోయింది’ అని Xలో ఫైరయ్యారు.
News November 1, 2024
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: నవంబర్ 1, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:15 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 1, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.