News October 31, 2024
ఏపీలో రెన్యువబుల్ ఎనర్జీ జోన్లు
APలో పునరుత్పాదక ఇంధన జోన్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా REZలను ఏర్పాటు చేయనుంది. సౌర, పవన, హైబ్రిడ్, బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి REZలను అందుబాటులోకి తీసుకురానుంది. రెన్యువబుల్ ఎనర్జీ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్లనూ ఏర్పాటు చేయనుంది. లేటెస్ట్ టెక్నాలజీతో ఉత్పత్తి చేసే విద్యుత్ ప్లాంట్లకు VGF సదుపాయం ప్రభుత్వం కల్పించనుంది.
Similar News
News January 3, 2025
ఇవాళ అకౌంట్లోకి డబ్బులు: ప్రభుత్వం
TG: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవాళ పూర్తి స్థాయిలో వేతనాలు జమ అవుతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది. 1వ తేదీన సాంకేతిక కారణాలతో జీతాలు జమ కాలేదని చెప్పింది. సమస్యలను పరిష్కరించి నిన్నటి నుంచి జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపింది. పలువురి ఖాతాల్లో గురువారం రాత్రి జమ కాగా, మిగతా వారికి ఇవాళ డబ్బులు పడనున్నాయి. కాగా జనవరి 1న సెలవు కావడంతో జీతాలు జమ కాలేదనే ప్రచారం జరిగింది.
News January 3, 2025
చర్లపల్లి రైల్వే టెర్మినల్ 6న ప్రారంభం
TG: చర్లపల్లిలో రూ.430 కోట్లతో నిర్మించిన రైల్వే టెర్మినల్ ఈ నెల 6న ప్రారంభం కానుంది. ప్రధాని మోదీ వర్చువల్‌గా ఈ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. గత నెల 28నే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ మాజీ పీఎం మన్మోహన్ మృతి కారణంగా వాయిదా పడింది. సికింద్రాబాద్ స్టేషన్‌పై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు.
News January 3, 2025
డబుల్ డెక్కర్‌గా విజయవాడ, వైజాగ్ మెట్రోలు
AP: విజయవాడ, వైజాగ్‌లో మెట్రో ప్రాజెక్టులకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను రూపొందించాలని సర్కారు భావిస్తోంది. దీనికి సంబంధించిన డిజైన్లను సీఎం చంద్రబాబు తాజాగా ఆమోదించారు. డబుల్ డెక్కర్ ప్లాన్‌లో పైన మెట్రో ట్రాక్, కింద వాహనాలకు ఫ్లై ఓవర్ ఉంటుంది. వైజాగ్‌లో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకూ, విజయవాడలో రామవరప్పాడు రింగ్ నుంచి నిడమానూరు వరకూ డబుల్ డెక్కర్ ఉంటుంది.