News October 31, 2024

12 భారతీయ సంస్థలు, ఇద్దరు పౌరులపై అమెరికా ఆంక్షలు

image

ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు స‌హ‌క‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై 12కిపైగా భారతీయ కంపెనీలు, ఇద్దరు పౌరులపై అమెరికా ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో 400+ సంస్థలు, వ్యక్తులు ఉన్నారు. వీరు యుద్ధానికి అవసరమైన పరికరాలను ర‌ష్యాకు స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్టు అమెరికా ఆరోపించింది. సిక్కు వేర్పాటువాది పన్నూ హత్య కుట్రలో భారత మాజీ గూఢ‌చారి ప్రమేయంపై అమెరికా అభియోగాలు మోపిన అనంతరం తాజా ఆంక్షలు చర్చకు దారి తీశాయి.

Similar News

News November 1, 2024

NPCIకి రాజీనామా.. MCX ఎండీగా ప్రవీణా రాయ్

image

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా COO ప్రవీణా రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్(MCX) MD, CEOగా బాధ్యతలు చేపట్టారు. ఈమె నియామకానికి ‘సెబీ’ ఆగస్టులోనే ఆమోదం తెలిపింది. ఫైనాన్షియల్ సెక్టార్‌లో ఆమెకు 30ఏళ్ల అనుభవం ఉంది. కోటక్ మహీంద్రా, సిటీ బ్యాంక్, HSBC బ్యాంకుల్లో పని చేశారు. NPCIలో బిజినెస్ స్ట్రాటజీ, మార్కెటింగ్ తదితర విభాగాలను పర్యవేక్షించారు.

News November 1, 2024

ఎవరు కావాలో మాకు తెలుసు: పార్థ్ జిందాల్

image

రిషభ్ పంత్‌ను DC అట్టిపెట్టుకోకపోవడం, జట్టు కూర్పుపై కో ఓనర్ పార్థ్ జిందాల్ స్పందించారు. ‘ఎవరు కావాలో మాకు తెలుసు. అనుభవం, యంగ్ ప్లేయర్ల కలయికతో అక్షర్, కుల్దీప్, స్టబ్స్, పొరెల్‌ను రిటైన్ చేసుకున్నాం. ఇందుకు హ్యాపీగానే ఉన్నాం. మాకు రెండు RTM కార్డులున్నాయి. గతంలో ఢిల్లీకి ఆడిన ఆటగాళ్లను కొనసాగించుకునే అవకాశం ఉంది. మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

News November 1, 2024

ట్రంప్ అసభ్యంగా తాకి ముద్దు పెట్టారు.. స్విస్ మోడల్ బీట్రైస్ కీల్

image

ట్రంప్ లైంగిక దుష్ప్ర‌వ‌ర్త‌న‌పై మ‌రో మోడ‌ల్ ఆరోప‌ణ‌లు గుప్పించారు. 1993లో న్యూయార్క్‌లోని ప్లాజా హోటల్‌లో డోనాల్డ్ ట్రంప్ తనను అనుచితంగా తాకి, పెదాల‌పై ముద్దు పెట్టారని స్విస్ మోడ‌ల్‌ బీట్రైస్ కీల్ ఆరోపించారు. దీంతో ట్రంప్‌పై లైంగిక దుష్ప్రవర్తన ఆరోప‌ణ‌ల సంఖ్య 28కి చేరింది. ఇటీవ‌ల మోడ‌ల్ స్టాసీ విలియమ్స్ కూడా ట్రంప్‌పై ఈ త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేశారు. అయితే, ట్రంప్ బృందం ఈ ఆరోప‌ణ‌ల్ని ఖండించింది.