News November 1, 2024
ప్రత్యామ్నాయ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి లేఖ

బీర్పూర్ మండలం రేకులపల్లి గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ప్రత్యామ్నాయ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ MLC జీవన్ రెడ్డి కలెక్టర్కు లేఖ రాశారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లగా.. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు లేఖ రాసి సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
Similar News
News November 7, 2025
KNR: సహకార అధికారి కార్యాలయంలో ‘వందేమాతరం’

వందేమాతరం గీతానికి 150వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా సహకార అధికారి కార్యాలయంలో శుక్రవారం వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా సహకార అధికారి ఎస్. రామానుజాచార్య మాట్లాడుతూ.. వందేమాతరం గీతం మన దేశ స్వాతంత్య్రోద్యమానికి ప్రేరణగా నిలిచిందని, దేశభక్తి భావాలను పెంపొందించే శక్తి ఈ గీతంలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 7, 2025
కరీంనగర్ కలెక్టరేట్లో ‘వందేమాతరం’ గీతాలాపన

స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రజల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు కరీంనగర్ కలెక్టరేట్లో శుక్రవారం ఉద్యోగులు సామూహికంగా వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
News November 7, 2025
కరీంనగర్: రాష్ట్ర స్థాయి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలో దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. డిసెంబర్ 3న రాష్ట్ర స్థాయిలో జరిగే అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పురస్కారాలను అందుకునేందుకు అర్హులైన దివ్యాంగుల వ్యక్తులు/సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నామని జిల్లా సంక్షేమ అధికారిణి సరస్వతీ తెలిపారు. ఎంపికైన వారికి HYDలో అవార్డు ఇవ్వనున్నారు. ఆసక్తి గల వారు ఈనెల 15లోగా అప్లై చేసుకోలన్నారు.


