News November 1, 2024
నవంబర్ 1: చరిత్రలో ఈరోజు

✒ 1897: ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి జననం
✒ 1956: ఉమ్మడి ఏపీతో పాటు కేరళ, మైసూరు, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, అస్సాం, బెంగాల్ రాష్ట్రాల ఆవిర్భావం
✒ 1959: APలో పంచాయతీ రాజ్ వ్యవస్థ మొదలు
✒ 1966: పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఏర్పాటు
✒ 1973: మైసూరు రాష్ట్రం పేరు కర్ణాటకగా మార్పు
✒ 1974: మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ జననం
✒ 1986: హీరోయిన్ ఇలియానా జననం
✒ 1989: అలనాటి హీరో హరనాథ్ మరణం
Similar News
News January 22, 2026
అభిషేక్… రికార్డులు షేక్

న్యూజిలాండ్‌తో తొలి T20లో అభిషేక్ శర్మ రికార్డ్ సృష్టించారు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అతడు, 25 లేదా అంతకంటే తక్కువ బాల్స్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు(8) చేసిన బ్యాటర్‌గా నిలిచారు. గతంలో సూర్య, సాల్ట్, లూయిస్‌తో(7 సార్లు) సంయుక్తంగా ఉన్న అభిషేక్ ఇవాళ వారిని అధిగమించారు. NZపై ఓ భారత్ బ్యాటర్ అతితక్కువ బంతుల్లో అర్ధసెంచరీ చేయడంలోనూ ఘనత వహించారు. గతంలో రోహిత్, రాహుల్ 23బంతుల్లో 50 కొట్టారు.
News January 22, 2026
అడిషనల్ కలెక్టర్ ఆస్తులు రూ.వందల కోట్లు

TG: గతనెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ACB ఇవాళ రైడ్స్ చేసింది. సోదాల్లో రూ.4.65Cr విలువైన విల్లా, ఒక ఫ్లాట్, 8 ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి పేపర్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. రూ.30లక్షల నగదు, 297 గ్రా. బంగారం, రూ.44.04 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.
News January 22, 2026
భారత్ ఘన విజయం

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో 48 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో NZ తడబడింది. ఫిలిప్స్(78), చాప్‌మన్(39) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. IND బౌలర్లలో చక్రవర్తి, దూబె చెరో 2, అక్షర్, అర్ష్‌దీప్, హార్దిక్ తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్‌లో అభిషేక్(84), రింకూ సింగ్(44), సూర్యకుమార్(32) రాణించారు.


