News November 1, 2024
వరదల కల్లోలం.. 158 మంది దుర్మరణం
స్పెయిన్‌లో భారీ వర్షాలు, వరదలు అల్లకల్లోలం సృష్టించాయి. ఇప్పటి వరకు 158 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. వాలెన్సియా సిటీలోని 155 మంది మృత్యువాత పడినట్లు తెలిపారు. వరదల తర్వాత పరిస్థితి భయానకంగా ఉంది. కొట్టుకుపోయిన వాహనాల్లోనే మృతదేహాలు బయటపడుతున్నాయి. భారీ వృక్షాలు నేలకూలగా విద్యుత్ లైన్లు, రోడ్లు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి.
Similar News
News November 16, 2024
లేడీస్ ‘ఫస్ట్’
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా జరిగిన ఫస్ట్ ఫేజ్ పోలింగ్‌లో మహిళా ఓటర్లే ఎక్కువశాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ తెలిపింది. పురుషుల కంటే 4.8శాతం ఎక్కువగా ఆడవారి ఓట్లే నమోదయ్యాయని తెలిపింది. కాగా ఈ నెల 13న జరిగిన పోలింగ్‌లో 66.66% పోలింగ్ నమోదైంది. 2019 పోలింగ్ కంటే 2.75శాతం అధికమని ఈసీ వివరించింది.
News November 16, 2024
ఏప్రిల్ 10 నుంచి టీచర్ల బదిలీలు!
AP: YCP ప్రభుత్వం తీసుకొచ్చిన GO-117 రద్దు, బదిలీల చట్టంపై ఈ నెల 30న డైరెక్టరేట్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందుతాయి. టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన వివరాలను DEC 20 నుంచి 3 విడతల్లో సేకరిస్తారు. HMలకు APR 10-15, స్కూల్ అసిస్టెంట్లకు APR 21-25, SGTలకు మే 1-10 వరకు బదిలీలు ఉంటాయి. వారానికి 42 పీరియడ్ల బోధన, ప్రాథమిక స్థాయిలో 20 మందికి ఒక టీచర్ వంటి వాటిని అమలుచేయడమే జీవో-117 ఉద్దేశం.
News November 16, 2024
నిరసనలకు ఆర్టీసీ, సీపీఎస్ ఉద్యోగుల పిలుపు
AP: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని ఎంప్లాయీస్ యూనియన్ మండిపడింది. ఈ నెల 19, 20 తేదీల్లో అన్ని డిపోలు, జోనల్ వర్క్‌షాపుల వద్ద నిరసనలు చేయనున్నట్లు ప్రకటించింది. కూటమి నేతలు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్, జీపీఎస్ స్థానంలో కొత్త పింఛన్ పథకాన్ని తీసుకురావాలనే డిమాండ్‌తో డిసెంబర్ 10న ఛలో విజయవాడ నిర్వహించనున్నట్లు సీపీఎస్ ఉద్యోగుల సంఘం వెల్లడించింది.