News November 1, 2024

ఎవరు కావాలో మాకు తెలుసు: పార్థ్ జిందాల్

image

రిషభ్ పంత్‌ను DC అట్టిపెట్టుకోకపోవడం, జట్టు కూర్పుపై కో ఓనర్ పార్థ్ జిందాల్ స్పందించారు. ‘ఎవరు కావాలో మాకు తెలుసు. అనుభవం, యంగ్ ప్లేయర్ల కలయికతో అక్షర్, కుల్దీప్, స్టబ్స్, పొరెల్‌ను రిటైన్ చేసుకున్నాం. ఇందుకు హ్యాపీగానే ఉన్నాం. మాకు రెండు RTM కార్డులున్నాయి. గతంలో ఢిల్లీకి ఆడిన ఆటగాళ్లను కొనసాగించుకునే అవకాశం ఉంది. మెగా వేలంలో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తున్నాం’ అని తెలిపారు.

Similar News

News November 1, 2024

ఆపద్బాంధవుడవయ్యా ముకేశ్!

image

ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా-ఏ కేవలం 107 రన్స్‌కే ఆలౌటైన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం సాధించి గెలవడం పక్కా అనే దశలో భారత పేసర్ ముకేశ్ కుమార్ ఆపద్బాంధవుడయ్యారు. 46 పరుగులిచ్చి 6 కీలక వికెట్లు పడగొట్టారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ముకేశ్ రాణింపుతో భారీ లీడ్ తప్పింది.

News November 1, 2024

IPL: ఈ ప్లేయర్లకు భారీ జాక్‌పాట్

image

IPL-2025 రిటెన్షన్‌లో పలువురు ప్లేయర్లు జాక్‌పాట్ కొట్టేశారు. RR వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్‌కు 2024లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే దక్కగా ఈసారి రూ.14 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. అంటే ఏకంగా 6900% అధికం. పతిరణ (రూ.13 కోట్లు), రజత్ పాటిదార్ (రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్ (రూ.11 కోట్లు), సాయి సుదర్శన్ (రూ.8.50 కోట్లు), శశాంక్ సింగ్ (రూ.5.50 కోట్లు), రింకూ సింగ్ (రూ.13 కోట్లు)లు ఈ లిస్టులో ఉన్నారు.

News November 1, 2024

గెలవాలనే మైండ్‌సెట్ ఉన్న వారినే రిటైన్ చేసుకున్నాం: LSG ఓనర్

image

ఐపీఎల్: లక్నో రిటెన్షన్లపై ఆ ఫ్రాంచైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జట్టు కోసం ఆడే, గెలవాలనే మైండ్‌సెట్ ఉన్న ప్లేయర్లనే మేం రిటైన్ చేసుకున్నాం. టీం కాకుండా వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడేవాళ్లను పక్కనబెట్టాం’ అని వ్యాఖ్యానించారు. కేఎల్ రాహుల్‌ను ఉద్దేశించే గోయెంకా ఈ కామెంట్స్ చేశారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. రాహుల్ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉండటమే ఇందుకు కారణమంటున్నారు.